త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్య‌ల‌తో మాకు సంబంధం లేదు: కొండా ముర‌ళి

Konda Murali | కాంగ్రెస్‌ను వీడేది లేద‌ని.. నా బిడ్డ వ్యాఖ్య‌ల‌తో మాకు సంబంధం లేద‌ని మంత్రి కొండా సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్లాన్‌-ఎ ప్ర‌కారం ఆమె మాట్లాడింద‌ని.. ఆమెకున్న ప్లాన్-బి ఏంటో త‌న‌కు తెలియ‌ద‌న్నారు.

S

Telangana | Published On Aug 26, 2026, 3.29 pm IST

Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్య‌ల‌తో మాకు సంబంధం లేదు: కొండా ముర‌ళి
Advertisement

Konda Murali | త్రినేత్ర‌.న్యూస్: కాంగ్రెస్‌ను వీడేది లేద‌ని.. నా బిడ్డ వ్యాఖ్య‌ల‌తో మాకు సంబంధం లేద‌ని మంత్రి కొండా సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్లాన్‌-ఎ ప్ర‌కారం ఆమె మాట్లాడింద‌ని.. ఆమెకున్న ప్లాన్-బి ఏంటో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. బుధ‌వారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అనంత‌రం ఆయ‌న మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమిచ్చారు. బిల్లు కోస‌మే ప్ర‌జాభ‌వ‌న్‌కు వ‌చ్చానన్నారు. త‌న కూతురు మాట్లాడిన విష‌యంలో క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏమి మాట్లాడ‌న‌న్నారు.

నా బిడ్డ ఇష్యూకు నాకు సంబంధం లేదు. ఆమె మ‌నోభావాలు ఆమెకు ఉండొచ్చు. కొండా సురేఖ అంశం, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించలేదు. సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మంత్రి సురేఖ వ‌రంగ‌ల్‌లో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూనే ఉంది. మంగ‌ళ‌వారం వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధ‌వారం కూడా మరో కార్యక్రమానికి హాజరయ్యారు అని కొండా ముర‌ళి తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఈ స‌మావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజ‌రు కావ‌డంతో ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇటీవ‌ల పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పైనే చ‌ర్చించార‌ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

Advertisement
Advertisement