త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Farmers Protest | కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని తెచ్చి త‌ప్పు చేశాం.. ఇప్పుడు చెప్పుల‌తో కొట్టుకుంటున్నం

Farmers Protest | ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ‌రా కే గ్రామ రైతులు సోమ‌వారం వినూత్న రీతిలో త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Oct 12, 2026, 1.36 pm IST

Farmers Protest | కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని తెచ్చి త‌ప్పు చేశాం.. ఇప్పుడు చెప్పుల‌తో కొట్టుకుంటున్నం
Advertisement
  • యాసంగి పంట వేయొద్ద‌ట‌.. ఖ‌రీఫే స‌రిగా పండ‌లే
  • ఇప్పుడేం చేయాలంటూ ఆదిలాబాద్ రైతుల ఆవేద‌న‌

Farmers Protest | త్రినేత్ర న్యూస్‌: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ‌రా కే గ్రామ రైతులు సోమ‌వారం వినూత్న రీతిలో త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. అర్ధ‌న‌గ్నంగా మొకాళ్ల‌పై నిల‌బ‌డి చెప్పుల‌తో కొట్టుకుంటూ పంట చేన్ల వద్ద‌ నిర‌స‌న తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని తెచ్చి త‌ప్పు చేశామ‌ని.. ఇప్పుడు మా చెప్పుల‌తో మేమే కొట్టుకునుడైతుంద‌ని వాపోయారు. రబీ (Rabi) పంటలు వేయొద్దని, కరెంట్ ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహించారు.

ఏడాదికి మూడు పంట‌లు తీస్తుంటిమి

కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈరోజు చెప్పుల‌తో కొట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. కేసీఆర్ హ‌యాంలో గ‌త 10 సంవ‌త్స‌రాలుగా 24 గంట‌లు క‌రెంటు, నీళ్లుండే. ఏడాదికి మూడు పంట‌లు తీస్తుంటిమి మేం. త్రి ఫేజ్ క‌రెంటు వ‌స్తుండే. నీళ్లు ఇస్తుండే. ప‌దేళ్లుగా చాలా బాగా పంట‌లు తీశాం.

ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వ‌చ్చినంక యాసంగి పంట వేయొద్ద‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి చెప్తున్న‌రు. క‌రెంటు కూడా ఇయ్య‌మంటున్న‌రు. ఖ‌రీఫ్ కూడా స‌రిగా పండ‌లే. ఇప్పుడు యాసంగి పంట వద్దంటే ఎట్ల‌? దుక్కి దున్ని రెడీ చేసుకున్నం. ఇది వ‌చ్చిన క‌రువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాంగ్రెస్‌ను గెలిపించి మా చెప్పుల‌తో మేమే కొట్టుకునుడైతుంది. ఈ ప్ర‌భుత్వాన్ని తెచ్చినందుకు బాధ ప‌డుతున్నం అని రైతులు వాపోయారు.

Advertisement
Advertisement