త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPI Narayana | భగీర‌థ్‌ను ఎన్‌కౌంట‌ర్ చేయమ‌ని అడ‌గ‌లే.. అరెస్టు చేయ‌మ‌న్నాం: సీపీఐ నారాయణ

CPI Narayana | ఎవ‌రెవ‌రినో ఎన్‌కౌంట‌ర్ చేశార‌ని.. అయినా బండి భ‌గీర‌థ్‌ (Bandi Bhagirath) ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌మ‌ని తాము అడ‌గ‌లేద‌ని, అరెస్టు చేయ‌మ‌న్నామ‌ని సీపీఐ నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఈ పోక్సో కేసులో కేంద్రం, రాష్ట్రం, పోలీసు, న్యాయ వ్య‌వ‌స్థ‌లు ముద్దాయి అయ్యాయ‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On May 17, 2026, 2.03 pm IST

CPI Narayana | భగీర‌థ్‌ను ఎన్‌కౌంట‌ర్ చేయమ‌ని అడ‌గ‌లే.. అరెస్టు చేయ‌మ‌న్నాం: సీపీఐ నారాయణ
Advertisement
  • ఈ కేసులో పోలీసు వ్య‌వ‌స్థ ప్ర‌శ్నార్థ‌మైంది
  • కేంద్రం, రాష్ట్రం, న్యాయ వ్య‌వ‌స్థ ముద్దాయి అయ్యాయి
  • సీపీఐ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CPI Narayana | త్రినేత్ర‌.న్యూస్‌: ఎవ‌రెవ‌రినో ఎన్‌కౌంట‌ర్ చేశార‌ని.. అయినా బండి భ‌గీర‌థ్‌ (Bandi Bhagirath) ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌మ‌ని తాము అడ‌గ‌లేద‌ని, అరెస్టు చేయ‌మ‌న్నామ‌ని సీపీఐ నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు భగీరథ్‌ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారని, మ‌రోవైపు నేనే నా కొడుకును పోలీసుల‌కు అప్ప‌గించాన‌ని కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) అంటున్నార‌న్నారు. ఈ ప‌రిణామాల వేళ పోలీస్ వ్య‌వ‌స్థ ప్ర‌శ్నార్థ‌క‌మైంద‌న్నారు.

నేనే పోలీస్ స్టేషన్‌కు పంపించానని బండి సంజయ్ అంటున్నాడు. దీంతో పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ ముద్దాయి అయ్యాడు. కోర్టు అసమర్థత బయటపడింది. నిందితుడు బండి భగీరథ్‌ మీద పోక్సో (POCSO) కేసు పెట్టినప్పుడు అతనిని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. ఎవరెవరినో ఎన్ కౌంటర్ చేశారు.. ఇతన్ని ఎన్‌కౌంటర్‌ చేయమని చెప్పడం లేదు. కనీసం అరెస్ట్ కూడా చేయలేదు అని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

పోలీసుల‌కు చేత కాలేదా?

సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత అరెస్టు చేస్తే ఈ గొడ‌వ ఉండేది కాదు. బండి సంజ‌య్ కొడుకును అరెస్టు చేయ‌డానికి పోలీసుల‌కు చేత‌కాలేదా? బండి సంజ‌య్ చెప్పేంత వ‌ర‌కు అరెస్టు చేయ‌క‌పోవ‌డం పోలీసుల డొల్ల‌త‌న‌మే అవుతుంది. త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు భ‌గీర‌థ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించి ఉంటే అయిపోయేది. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వం, పోలీసు వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వ‌స్థ ముద్దాయి అయింది. ఇది విచార‌కరం. వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి అని సీపీఐ నారాయ‌ణ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement