Obstruction of Dalits | ఈ గుడి మేం కట్టించాం.. మీరెలా వస్తారు.. దళితులను అడ్డుకున్న ఎమ్మెల్యే మేనమామ
Obstruction of Dalits | ఎన్ని చట్టాలున్నా.. ఎంత టెక్నాలజీ వచ్చినా కుల దురహంకారం మాసిపోతలేదు. ఆలయ ప్రవేశాల్లో తరచూ ఏదో ఓ చోట దళితులకు అవమానం జరుగుతూనే ఉంది. తాజాగా వనపర్తి జిల్లాలో దళితుల ఆలయ ప్రవేశం చేయకుండా వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి అడ్డుకున్నారు.
Obstruction of Dalits | త్రినేత్ర న్యూస్: ఎన్ని చట్టాలున్నా.. ఎంత టెక్నాలజీ వచ్చినా కుల దురహంకారం మాసిపోతలేదు. ఆలయ ప్రవేశాల్లో తరచూ ఏదో ఓ చోట దళితులకు అవమానం జరుగుతూనే ఉంది. తాజాగా వనపర్తి జిల్లాలో దళితుల ఆలయ ప్రవేశం చేయకుండా వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి అడ్డుకున్నారు. పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్లిన దళిత వ్యక్తిని ఆలయంలోకి రానివ్వలేదు. “ఈ గుడి మేము కట్టించాం.. మీరెలా వస్తారు?” అంటూ దళితులపైకి ఊగిపోయారు.
అయితే ఆలయంలోకి అనుమతించాలని దళితులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అయినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఈ ఘటనపై దళితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆలయ పునర్నిర్మాణం, గ్రామ అభివృద్ధిలో సామాజిక వివక్ష లేకుండా తమను భాగస్వాములను చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా మంగంపల్లి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్వగ్రామం కావడం గమనార్హం.
ఈ ఘటనపై పలువురు సామాజిక సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంకా ఏ యుగంలో జీవిస్తున్నామని ఫైరవుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.
వనపర్తి జిల్లాలో దళితులకు అవమానం.. ఆలయ ప్రవేశానికి అడ్డంకి
ఎమ్మెల్యే మేఘారెడ్డి స్వగ్రామం మంగంపల్లిలో దళితుడిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే మేనమామ వెంకట్రామ్ రెడ్డి.
ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన దళితులు.
ఆలయంలోకి అనుమతించాలని
ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రంఅయినా పట్టించుకొని ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఆలయ పునర్నిర్మాణం, గ్రామ అభివృద్ధిలో సామాజిక వివక్ష లేకుండా తమను భాగస్వాములను చేయాలని దళితుల డిమాండ్.
https://t.co/1UHbJLYGr4
— TNews Telugu (@TNewsTelugu) October 13, 2026
తాజావార్తలు
- ●Kranthi Kiran | సింగూర్ను ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే
- ●Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే - శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్
- ●AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత
- ●L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
- ●DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్
- ●Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్

Kranthi Kiran | సింగూర్ను ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే

Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే - శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి






