త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Summer | నేటి నుంచి దంచికొట్ట‌నున్న ఎండ‌లు..! జ‌ర జాగ్ర‌త్త‌..!!

Summer | రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎండ‌లు దంచికొట్ట‌నున్నాయి. ఇప్ప‌టికే ఎండ‌లు మండిపోతున్నాయి. ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం నుంచి ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది.

S

Telangana | Published On Mar 1, 2026, 8.55 am IST

Summer | నేటి నుంచి దంచికొట్ట‌నున్న ఎండ‌లు..!  జ‌ర జాగ్ర‌త్త‌..!!
Advertisement

Summer | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎండ‌లు దంచికొట్ట‌నున్నాయి. ఇప్ప‌టికే ఎండ‌లు మండిపోతున్నాయి. ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం నుంచి ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. మార్చి 3 నుంచి 7వ తేదీ వ‌ర‌కు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, ములుగు, భూపాల‌ప‌ల్లి, మంచిర్యాల‌, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో 36 నుంచి 37 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే అవ‌కాశం ఉంది. మిగ‌తా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement