Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
ప్రెగ్నెన్సీతోనూ అర్థరాత్రి వరకు ఓ టీవీ షో షూటింగ్‌లో పాల్గొన్నది సమంత. మా ఇంటి బంగారంతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న ఈ గ్లామర్ క్వీన్ ప్రస్తుతం తమిళంలో సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతుంది. త్వరలో సోనిలివ్ ఓటీటీలో ఈ షో టెలికాస్ట్ కాబోతుంది. మాస్టర్ చెఫ్ షూటింగ్‌లో ఉదయం నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు నాన్‌స్టాప్‌గా పాల్గొన్నది సమంత. ఆమె డెడికేషన్‌పై మేకర్స్‌తో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Entertainment | Published On Sep 21, 2026, 3.02 pm IST
Samantha | ప్రెగ్నెన్సీతో ఉండి కూడా అర్ధరాత్రి వరకు షూటింగ్‌లో పాల్గొన్నది సమంత. ఆమె డెడికేషన్, కమిట్‌మెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మా ఇంటి బంగారం మూవీతో రీఎంట్రీలో అదరగొట్టింది సమంత. నందిని రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లతో రికార్డులు తిరగరాసింది. మా ఇంటి బంగారం తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు గ్యాప్ తీసుకుంది సమంత. ఈ విరామంలో తమిళంలో ఓ టీవీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళ సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతుంది.
సోనీ లివ్ ఓటీటీలో..
సోని లివ్ ఓటీటీతో పాటు సోనీవిళా టీవీలో మాస్టర్ చెఫ్ టెలికాస్ట్ కాబోతుంది. కుకరీ షో షూటింగ్ కోసం ఇటీవలే చెన్నై వెళ్లింది సమంత. షూటింగ్ కూడా మొదలుపెట్టింది. గత వారం ఒకే రోజు ఐదారు ఎపిసోడ్స్ తాలూకు షూటింగ్‌ను మేకర్స్ పూర్తిచేసినట్లు తెలిసింది. ఉదయం నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. బ్రేక్ లేకుండా సమంత కూడా మాస్టర్ చెఫ్ షూటింగ్‌లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. షూటింగ్ మొత్తం ఎలాంటి అలసట లేకుండా చాలా హుషారుగా కనిపించిందని అంటున్నారు. సమంత ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఆరోగ్యం విషయంలో మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చిత్రీకరణను పూర్తిచేసినట్లు సమాచారం.
నెక్స్ట్ లెవెల్...
సమంత డెడికేషన్‌పై మాస్టర్ చెఫ్ మేకర్స్‌తో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రెగ్నెన్సీలో తన అంకితభావాన్ని చాటుకుందని అంటున్నారు. ఆమె కమిట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. మాస్టర్ చెఫ్ కోసం సమంత భారీగానే రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. ఇరవై కోట్లకుపైనే ఆమె పారితోషికాన్ని అందుకున్నట్లు చెబుతోన్నారు.
తమిళంలో ఇదే ఫస్ట్...
సమంతహోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఫస్ట్ తమిళ షో ఇదే కావడం గమనార్హం. గతంలో తెలుగులో సామ్‌జామ్ పేరుతో ఓ టాక్ చేసింది సమంత. ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయిన ఈ షో పెద్ద సక్సెస్ అయ్యింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్
- ●Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..
- ●Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి
- ●Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!
- ●Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు
- ●Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ - లంగా ఓణీలో కృతిశెట్టి - జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్

Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..

Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి

Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!






