Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?
Harish Rao | జూరాలలో 8.4 టీఎంసీల నీరున్నా రైతులకు నీళ్లు ఇవ్వడానికి సీఎం రేవంత్‌కు ఎందుకు మనసు రావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు.
- పెన్నా బేసిన్‌లో ఉన్న కుప్పం వరకు నీళ్లు తరలిస్తున్నరు.. పక్కనే ఉన్న పాలమూరుకు ఇవ్వలేరా?
- సాకులతో సాగు నడుస్తదా రేవంత్?
- రైతులు, బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
Harish Rao | త్రినేత్ర.న్యూస్: జూరాలలో 8.4 టీఎంసీల నీరున్నా రైతులకు నీళ్లు ఇవ్వడానికి సీఎం రేవంత్‌కు ఎందుకు మనసు రావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ఎక్కడో పెన్నా బేసిన్‌లో ఉన్న కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తుంటే పక్కనే ఉన్న పాలమూరుకు ఎందుకు తరలించడం లేదని నిలదీశారు. ఎల్‌నినో సాకులతో సాగు ముందుకు ఎలా వెళ్తుందని రేవంత్‌ను ప్రశ్నించారు. పాలమూరులో బీఆర్ఎస్ శ్రేణులను, రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న రైతులు, ఉమ్మడి పాలమూరు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను అక్రమంగా నిర్బందించడం దుర్మార్గం.
కృష్ణా జలాలను శ్రీశైలం నుండి 738 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పెన్నా బేసిన్‌లో ఉన్న కుప్పం వరకు తరలిస్తుంటే.. పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు తరలించడం లేదు? ఇది కాంగ్రెస్ పాలనా వైఫల్యం కాదా? పాలకుల చేతగానితనం కాదా?
కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లపూర్ (8.51 tmc), ఏదుల (6.55tmc), కరివెన (17.34tmc), వట్టెం (16.74) మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలను నిర్మిస్తే.. వాటిని నీళ్లతో నింపే సోయి కూడా మీకు లేదా గడిచిన రెండున్నరేళ్ల పాటు కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు పారినా ఎందుకు మోటర్లను నడపలేదు? శ్రీశైలం నిండుకుండలా ఉన్నా రైతులకు నీళ్లు ఎత్తిపోసే ఆలోచన ఎందుకు చేయలేదు? కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారు? ముఖ్యమంత్రి గానీ, నీళ్ల మంత్రిగాని దీనికి సమాధానం చెబుతారా?
పాలమూరును ప్రాజెక్టును పడావు పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి పాలమూరు రైతులకు చేస్తున్న నమ్మకద్రోహం ఇది. రైతులంటే ఎందుకు అంత నిర్లక్ష్యం రేవంత్ రెడ్డి? వ్యవసాయం అంటే ఎందుకు ఇంత పట్టింపులేని తనం?
రైతులు నీళ్లడిగితే సంకెళ్లు వేస్తరా?
జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించి, ఆనకట్ట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారు? ఎందుకింత దౌర్జన్యం రేవంత్ రెడ్డి? రైతులు నీళ్లు అడుగుతుంటే, వాళ్ల చేతికి సంకెళ్లు వేస్తారా? కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు. నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు తప్పు మీరు చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా?
ఎల్‌నినో సాకు చెప్పి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటారా? సాకులు చెప్పి తప్పించుకుంటే.. సాగు ముందుకు పోతుందా రేవంత్ రెడ్డి? పంట పొలాలకు సాగు నీళ్లు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. పంట పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతుంటే అది మీకు కనిపించడం లేదా?
జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న మా పార్టీ నాయకులను రైతులను విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం .
జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న రైతులు, ఉమ్మడి పాలమూరు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం… pic.twitter.com/e2TNWAGbtk
— Harish Rao Thanneeru (@BRSHarish) September 21, 2026
సంబంధిత వార్తలు

Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట
సెప్టెంబర్ 21, 2026

Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి
సెప్టెంబర్ 21, 2026

Jupally Krishna Rao | నీటి సమస్య ఉందన్నది 100 శాతం వాస్తవం
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..
- ●Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట
- ●Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
- ●Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్
- ●Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట

Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు

Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి



