త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ఖైర‌తాబాద్ అభ్య‌ర్థిని అధిష్టానం నిర్ణ‌యిస్తుంది : మ‌హేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల విష‌యంలో హైకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని, ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Sep 19, 2026, 2.12 pm IST

Mahesh Kumar Goud | ఖైర‌తాబాద్ అభ్య‌ర్థిని అధిష్టానం నిర్ణ‌యిస్తుంది : మ‌హేశ్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల విష‌యంలో హైకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని, ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎవ‌రు పోటీ చేయాల‌నేది హైక‌మాండ్ నిర్ణ‌యిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో మ‌హేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు.

హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు.. కాంగ్రెస్‌కు శ్రీరామరక్ష‌. పార్టీ ఫిరాయింపులను గతంలో బీఆర్‌ఎస్‌ ప్రోత్సహించింది. పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్‌కు విపక్ష హోదా లేకుండా చేశారు. దళిత బిడ్డ భట్టి విక్ర‌మార్క‌ను అవమానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చగొట్టారు. రాష్ట్రపతి పాలన వస్తుందని కూడా అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చింది బీఆర్‌ఎస్‌. 2014, 2018లోనూ పార్టీ ఫిరాయింపులు జరిగాయి. కేసీఆర్‌ హయాంలో అనేక నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ గతంలో చేసిన ఫిరాయింపులను ఇప్పుడు ఆ పార్టీ నేతలు మరిచిపోయారు అని మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

టీఎంసీ, శివసేన, ఎన్‌సీపీని బీజేపీ చీల్చింద‌ని మ‌హేశ్ ఆరోప‌ణ చేశారు. మోదీ, అమిత్‌షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని విమర్శించారు. పాత బీజేపీ నేతలకు ఉన్న విలువలు ప్రస్తుత నేతలకు లేవని టీ పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement