త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatesh | ముగ్గురు హీరోయిన్ల‌తో వెంక‌టేష్ స్టెప్పులు – ఆద‌ర్శ‌కుటుంబం ఫ‌స్ట్ సింగిల్‌పై అప్‌డేట్‌

ఆద‌ర్శ కుటుంబం సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ల‌తో హీరో వెంక‌టేష్ స్టెప్పులు వేయ‌బోతున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ను సెప్టెంబ‌ర్ 22న రిలీజ్ చేయ‌బోతున్నారు. నారాయ‌ణ‌మ్మ అంటూ ఫోక్ స్టైల్‌లో సాగే ఈ పాట‌లో వెంక‌టేష్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి, డింపుల్ హ‌య‌తి, నివేదా పేతురాజ్ క‌నిపించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Sep 21, 2026, 2.18 pm IST

Venkatesh | ముగ్గురు హీరోయిన్ల‌తో  వెంక‌టేష్ స్టెప్పులు – ఆద‌ర్శ‌కుటుంబం ఫ‌స్ట్ సింగిల్‌పై అప్‌డేట్‌
Advertisement

Venkatesh |  హీరో వెంక‌టేష్ ముగ్గురు హీరోయిన్ల‌తో క‌లిసి స్టెప్పులు వేయ‌బోతున్నారు. వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీ ఆద‌ర్శ‌కుటుంబం. ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా అక్టోబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఇందులో వెంక‌టేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది. నారా రోహిత్‌, యువీనా పార్థ‌వి, రాజా ప్ర‌జ్వ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

నారాయ‌ణ‌మ్మ‌...

ఆద‌ర్శ‌కుటుంబం ఫ‌స్ట్ సింగిల్‌పై మేక‌ర్స్ అప్‌డేట్ ఇచ్చారు. నారాయ‌ణ‌మ్మ అంటూ సాగే ఈ పాట‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మాస్ సాంగ్‌లో వెంక‌టేష్ ముగ్గురు హీరోయిన్ల‌తో స్టెప్పులు వేయ‌నున్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు నివేదా పేతురాజ్‌, డింపుల్ హ‌య‌తి ఈ పాట‌లో క‌నిపించ‌బోతున్నారు. ఫోక్ స్టైల్‌లో సాగే ఈ పాట‌కు ముగ్గురు హీరోయిన్ల గ్లామ‌ర్‌, త‌మ‌న్ మాస్ ట్యూన్స్ హైలైట్‌గా ఉంటాయ‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఫ‌స్ట్ సింగిల్‌తోనే ఆద‌ర్శ కుటుంబం ప్ర‌మోష‌న్స్‌ను మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా మొద‌లుపెట్ట‌నున్నారు.

77వ మూవీ...

వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న 77 మూవీ ఇది. త‌న ఫ్యామిలీని కాపాడుకోవ‌డానికి ఓ వ్య‌క్తి ఎలాంటి పోరాటం చేశాడు? మిడిల్ క్లాస్‌లో అప్పుల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే అత‌డు ఒక్క‌సారిగా రిచ్‌గా ఎలా మారాడు? అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందుతోంది. త‌న‌దైన‌ శైలి ఫ‌న్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి త్రివిక్ర‌మ్ ఈ మూవీని తెర‌కెక్కించారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న ఫ‌స్ట్ మూవీ. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన వాసు, నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రి సినిమాల‌కు త్రివిక్ర‌మ్ రైట‌ర్‌గా ప‌నిచేశారు.  ప్ర‌స్తుతం హీరోగా ఆద‌ర్శ కుటుంబంతో పాటు అనిల్ రావిపూడితో జ‌న‌వ‌రి 12 విడుద‌ల సినిమా చేస్తోన్నారు వెంక‌టేష్.

Advertisement

తాజావార్తలు

Advertisement