RTC Driver Suicide Attempt | ఆర్టీసీ సమ్మెలో విషాదం: నర్సంపేటలో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఎంజీఎంకు తరలింపు
తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్.. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని మనస్థాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
RTC Driver Suicide Attempt | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఓ కార్మికుడు బలవన్మరణానికి యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
బస్టాండ్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్.. గత రెండు రోజులుగా తోటి కార్మికులతో కలిసి సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం, తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం నర్సంపేట బస్టాండ్ ఎదురుగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఎంజీఎంలో అత్యవసర చికిత్స
మంటల్లో కాలిపోతున్న శంకర్ గౌడ్‌ను చూసిన వెంటనే అక్కడున్న తోటి ఆర్టీసీ సిబ్బంది స్పందించారు. మంటలను ఆర్పి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో శంకర్ గౌడ్ తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఎంజీఎం డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కట్టలు తెంచుకున్న కార్మికుల ఆగ్రహం
నిరసనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్న ఆవేదనతోనే తమ తోటి కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడని ఆర్టీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.
ఇప్పటికే గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో పోలీసులకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నిరసనకారులను అడ్డుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Telangana RTC Strike 2026 | ఆత్మబలిదానాలు వద్దు.. ఆ పార్టీల ట్రాప్‌లో పడొద్దు: ఆర్టీసీ కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి
ఏప్రిల్ 23, 2026

Telangana RTC strike 2026 | 6 వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం.. 65 లక్షల మంది ప్రయాణికుల అవస్థలు
ఏప్రిల్ 22, 2026

Telangana RTC strike 2026 | సమ్మె బాట వీడండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు: ఆర్టీసీ కార్మికులకు టీజీఎస్ఆర్టీసీ హెచ్చరిక
ఏప్రిల్ 22, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



