త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao – Peddi Sudarshan Reddy | నా ప్రాణాలు కాపాడిన చేతులే విగతజీవిగా.. ఆనాటి ఘటన తలచుకొని కన్నీరుమున్నీరైన హరీశ్ రావు

నాడు తన ప్రాణాలు కాపాడిన స్నేహితుడు.. నేడు అదే హాస్పిటల్‌లో విగతజీవిగా కనిపించడంతో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీటి పర్యంతమయ్యారు. ఆనాటి జ్ఞాపకాలు ఇవే..

J

Telangana | Published On Aug 10, 2026, 3.44 pm IST

Harish Rao – Peddi Sudarshan Reddy | నా ప్రాణాలు కాపాడిన చేతులే విగతజీవిగా.. ఆనాటి ఘటన తలచుకొని కన్నీరుమున్నీరైన హరీశ్ రావు

సంక్షిప్త సారాంశం

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ సభలో పాల్గొని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ సమయంలో తాను డీసీఎం పైనుంచి కిందపడితే ఏ ఆసుపత్రిలో చేర్పించాడో, అదే ఆసుపత్రిలో సుదర్శన్ రెడ్డిని విగతజీవిగా చూడాల్సి రావడం బాధాకరం అన్నారు. నర్సంపేటకు దేవాదుల నీళ్లు, మెడికల్ కాలేజీ తీసుకురావడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. పెద్ది కుటుంబానికి, నర్సంపేట ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Harish Rao - Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జరిగిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు హాజరైన ఆయన.. సుదర్శన్ రెడ్డితో తనకున్న పాతికేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ప్రాణాలు కాపాడిన మిత్రుడిని, చివరికి అదే హాస్పిటల్‌లో విగతజీవిగా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ గద్గద స్వరంతో మాట్లాడారు.

Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy

ఆ హాస్పిటల్.. ఆ పాత జ్ఞాపకం..

"మొన్న పెద్ది హాస్పిటల్‌లో పడితే నేను, కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్లాం. ఆ హాస్పిటల్ చూడగానే నాకొక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఉద్యమ సమయంలో వరంగల్ లోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసులతో జరిగిన ఘర్షణలో నేను డీసీఎం (DCM) పైనుంచి కింద పడిపోయాను. ఆ రోజు సుదర్శన్ రెడ్డి నన్ను పట్టుకోకపోతే నేరుగా భూమి మీద పడేవాడిని. నన్ను ఆయన పట్టుకుని, వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడాడు. నాడు ఏ హాస్పిటల్‌లో అయితే నన్ను చేర్పించాడో, పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో అదే హాస్పిటల్‌లో ఉన్నాడు. నేను ఆయనను అక్కడే చివరి చూపు చూస్తానని కలలో కూడా అనుకోలేదు" అని హరీశ్ రావు కన్నీరు పెట్టుకున్నారు.

Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy

నర్సంపేట అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్

తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు లెక్కచేయకుండా పోరాడిన గొప్ప ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని హరీశ్ రావు కొనియాడారు. మానుకోట సంఘటన నుంచి పరకాల, స్టేషన్ ఘనపూర్ ఉపఎన్నికల వరకు ప్రతి పోరాటంలో ఆయన ముందున్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఆయన పోరాట స్ఫూర్తిని మెచ్చిన కేసీఆర్ క్యాబినెట్ ర్యాంక్‌తో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారని తెలిపారు.

Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy

నర్సంపేట అభివృద్ధి పట్ల ఆయనకున్న తపన అసాధారణమైనదన్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ని ఒప్పించి రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల జలాలు సాధించిన ఘనత ఆయనదే అని స్పష్టం చేశారు. అలాగే, జిల్లా కేంద్రం కాని చోట మెడికల్ కాలేజీ (Medical College) సాధించిన ఏకైక నియోజకవర్గం నర్సంపేట మాత్రమేనని, ఇదంతా సుదర్శన్ రెడ్డి కృషే అని ప్రశంసించారు.

Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy

కేసీఆర్‌కు ఆయనంటే అపారమైన ప్రేమ

పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడేందుకు అమెరికా, లండన్ నుంచి డాక్టర్లను రప్పించడానికి ఎంత ఖర్చయినా పర్వాలేదని కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమేనన్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి, నర్సంపేట ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy
Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy
Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy
Harish Rao Emotional Speech Over Peddi Sudarshan Reddy

Advertisement
Advertisement