త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gas Cylinder | ఇంటి ప‌న్ను క‌ట్ట‌లేద‌ని.. గ్యాస్‌ సిలిండ‌ర్ సీజ్‌

Gas Cylinder | తీసుకున్న అప్పు చెల్లించ‌లేద‌ని బ్యాంకు అధికారులు రైతుల ఇండ్ల‌లో బీరువాలు, త‌లుపులు, ద‌ర్వాజ‌లు తీసుకెళ్ల‌డం మనం త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. ఇంటి ప‌న్ను క‌ట్ట‌క‌పోతే (Property Tax) మున్సిప‌ల్ అధికారులు స‌ద‌రు ఇంటి ముందు చెత్త వేయ‌డం, మంచి నీళ్లు బంద్ చేయ‌డం వంటివి గ‌తంలో చూశాం.

G

Telangana | Published On Mar 11, 2026, 7.58 am IST

Gas Cylinder | ఇంటి ప‌న్ను క‌ట్ట‌లేద‌ని.. గ్యాస్‌ సిలిండ‌ర్ సీజ్‌
Advertisement

Gas Cylinder | త్రినేత్ర‌.న్యూస్‌: తీసుకున్న అప్పు చెల్లించ‌లేద‌ని బ్యాంకు అధికారులు రైతుల ఇండ్ల‌లో బీరువాలు, త‌లుపులు, ద‌ర్వాజ‌లు తీసుకెళ్ల‌డం మనం త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. ఇంటి ప‌న్ను క‌ట్ట‌క‌పోతే (Property Tax) మున్సిప‌ల్ అధికారులు స‌ద‌రు ఇంటి ముందు చెత్త వేయ‌డం, మంచి నీళ్లు బంద్ చేయ‌డం వంటివి గ‌తంలో చూశాం. దుకాణాలు, వాణిజ్య స‌ముదాయాలైతే సీజ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంట్లో సిలిండ‌ర్ (Gas Cylinder) తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం గ్యాస్ సిలిండ‌ర్ల‌ కొర‌త ఉండ‌టంతో అదైతేనే స‌రైన ప‌ని అనుకున్నారో ఏమో..!

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రపాల‌క సంస్థ ప‌రిధిలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన గొలుసుల సుజాత ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో గత నెల 23న మున్సిప‌ల్ అధికారులు ప‌న్ను చెల్లించాలంటూ ఆమెకు నోటీసు ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ప‌న్ను క‌ట్ట‌క‌పోవ‌డంతో.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సోహైల్‌తోపాటు ఆరుగురు సిబ్బంది సుజాత ఇంటికి వచ్చారు. ప‌న్ను చెల్లించాల‌ని గ‌డువు ఇచ్చిన‌ప్ప‌టికీ ఇంకా క‌ట్ట‌క‌పోవ‌డంతో ఇంట్లో ఉన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఇంట్లో ఉన్న ఒక్క సిలిండర్‌ను కూడా తీసుకెళ్తే తాము వంట ఎలా చేసుకోవాలని ప్రాధేయపడినా వినకుండా అధికారులు సిలిండర్‌ తీసుకెళ్లారని బాధితురాలు చెప్పారు. ధనికులకు కార్పొరేషన్‌ అధికారులు నమస్తే పెట్టి వెళ్తున్నారని.. అదే పేద, మధ్య తరగతి ప్రజలను మాత్రం పన్నుల వసూలు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement