Dasyam Vinay Bhaskar | దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయ్.. ఎమ్మెల్యే నాయినికి దాస్యం సవాల్
Dasyam Vinay Bhaskar | కేటీఆర్ నీకు దమ్ము ఉంటే.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయ్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు.
Dasyam Vinay Bhaskar | త్రినేత్ర న్యూస్ : కేటీఆర్ నీకు దమ్ము ఉంటే.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయ్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు. నాయిని రాజేందర్ రెడ్డి నీకు 24 గంట సమయం ఇస్తున్నా.. దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రా అని సవాల్ విసిరారు. నేను స్వయంగా పోటీ చేయడానికి సిద్ధమని, నీకు నా స్థాయి ఎక్కువ కాబట్టి.. అవసరమైతే బీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థిని బరిలోకి దింపుతామని సవాల్ విసిరారు. దమ్ము ఉంటే రాజీనామా చెయ్... రాజకీయాల నుంచి తప్పుకొని ప్రజా జీవితంలో కొనసాగుతానని దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని బీఆర్ఎస్ విమర్శించారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, వ్యక్తిగత విమర్శలు, చిల్లర మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే ముందు ఆయన స్థాయిని, తెలంగాణకు చేసిన సేవలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రచారంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాలనీల్లో చిన్నచిన్న పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గతంలో తాను చేపట్టిన రోడ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దమ్మగడ్డ శ్మశాన వాటిక స్థలం, న్యూశాయంపేట దేవాలయ భూములను కబ్జా చేయాలని చూశావని విమర్శించారు. పేదలు, మైనారిటీలు, అన్ని వర్గాల సంక్షేమానికి తాను ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
సినిమా డైలాగులతో రాజకీయాలు చేయలేరు : నన్నపునేని నరేందర్

మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు మాట్లాడే ముందు విషయ పరిజ్ఞానం, రాజకీయ అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. సినిమా డైలాగులతో రాజకీయాలు చేయలేరని, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై అవగాహనతో మాట్లాడాలని సూచించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిధుల కొరత ఉందంటూనే వేల కోట్ల అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించి పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి తన ఘనతగా చెప్పుకుంటోందని ఆరోపించారు. కళాక్షేత్రం నిర్వహణకు నిధులు లేవంటూ కుడా కార్యాలయాన్ని అక్కడికి తరలించి అద్దెల ద్వారా ఆదాయం పొందాలని చూడటం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు. అభివృద్ధి, రాజకీయ అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంబేద్కర్, హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని ప్రత్యర్థి నాయకుడికి సవాల్ విసిరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి తాను, బీఆర్ఎస్ శ్రేణులు చర్చకు సిద్ధం అని తేదీ, సమయం మీరే నిర్ణయించండి.. మేం సిద్ధమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు
- ●Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు

Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు




