Seethakka Clarification on Kavitha | కవితను ఉద్దేశించి ఆ మాట అనలేదు.. పొరపాటున దొర్లింది
కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. పొరపాటున ఆ పదం దొర్లిందని వివరిస్తూ, బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. అసలు ఏం జరిగిందో తెలుసా?
సంక్షిప్త సారాంశం
ములుగు పర్యటనలో కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు కావాలని అన్నవి కావని, కేవలం నోరు జారడం వల్ల దొర్లిన పదమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. క్యాన్సర్ పేషెంట్ అని ప్రస్తావించబోయి, అంతకుముందు ఎయిడ్స్ బాధితుల పెన్షన్ల గురించి మాట్లాడుతుండటంతో పొరపాటున ఆ పదం వచ్చిందని వివరించారు. ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు వీడియో ద్వారా ప్రకటించిన సీతక్క, కవితను ట్రోల్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. వరంగల్ పర్యటనలో కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినందుకే తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
- వీడియో విడుదల చేసిన మంత్రి సీతక్క
Seethakka Clarification on Kavitha | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో రాష్ట్ర మంత్రి సీతక్క మంగళవారం స్పష్టతనిచ్చారు. ములుగు పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కవితను ఉద్దేశించి తాను కావాలని ఆ పదం అనలేదని, అది కేవలం మాటల్లో పొరపాటున దొర్లిందని ఆమె వివరించారు. ఆ పదాన్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటిస్తూ మంత్రి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
అసలు వివాదం ఎలా మొదలైందంటే?
సోమవారం ములుగులో 'చేయూత' కొత్త పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒంటరి మహిళలతో పాటు ఫైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని సీతక్క ప్రస్తావించారు. అనంతరం అదే అంశాలపై మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పర్యటనలో కేటీఆర్ ప్రభుత్వం మీద, పెన్షన్ల మీద చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు.
క్యాన్సర్ బదులు ఆ పదం దొర్లింది
గతంలో కవిత ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నన్ను క్యాన్సర్ పేషెంట్ అని, నాకు క్యాన్సర్ వచ్చిందని మా అన్న, మా పార్టీ వాళ్లే బదనాం చేశారు' అని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని తాను ఉటంకించాలనుకున్నట్లు సీతక్క తెలిపారు.
అయితే అంతకుముందే చేయూత పెన్షన్లలో భాగంగా ఎయిడ్స్ పేషెంట్ల గురించి మాట్లాడుతుండటంతో, క్యాన్సర్ అనే చోట అనుకోకుండా 'ఎయిడ్స్' అనే పదం దొర్లిందని ఆమె వివరించారు.
"కవిత గారూ.. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు. మీరు చింత పడొద్దు. నా ఉద్దేశం కూడా అది కాదు. పొరపాటున దొర్లిన ఆ పదాన్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ట్రోలింగ్‌పై సీతక్క ఫైర్
తాను వెంటనే పొరపాటును సరిదిద్దుకుని, ఆ పదాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు దాన్ని వైరల్ చేస్తూ కవితను పదే పదే ట్రోల్ చేయడం వారి నీచమైన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని మంత్రి మండిపడ్డారు.
వరంగల్ పర్యటనలో చేయూత పెన్షన్లపై కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను ఎండగట్టాననే అక్కసుతోనే తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటాను తప్ప, వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సీతక్క స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●PM Modi | మళ్లీ ఎన్డీఏ గూటికి శిరోమణి అకాలీదళ్.. స్వాగతించిన ప్రధాని మోదీ
- ●MeitY | కంప్యూటర్ ఉత్పత్తులను ప్రభుత్వాలు కొనాలంటే కొత్త నిబంధనలు.. భారత్‌లో తయారవ్వాల్సిందే..
- ●Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం - ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - మెగా వెర్స్ ప్రోమో రిలీజ్
- ●Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!
- ●Harish Rao | నీళ్ల లెక్కలడిగితే.. అబద్ధాల వరద పారిస్తున్నడు
- ●Badi Lake Udaipur | కరువు నుంచి ఉదయ్‌పూర్‌ను కాపాడిన 350 ఏళ్ల చారిత్రక చెరువు.. ఈ 'బడీ లేక్' విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

PM Modi | మళ్లీ ఎన్డీఏ గూటికి శిరోమణి అకాలీదళ్.. స్వాగతించిన ప్రధాని మోదీ

MeitY | కంప్యూటర్ ఉత్పత్తులను ప్రభుత్వాలు కొనాలంటే కొత్త నిబంధనలు.. భారత్‌లో తయారవ్వాల్సిందే..

Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం - ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - మెగా వెర్స్ ప్రోమో రిలీజ్

Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!





