Vikarabad | వికారాబాద్‌లో మహిళ అదృశ్యం.. నారాయణపేటలో సగం కాలిన స్థితిలో మృతదేహం..
Vikarabad | గత నెల 18న కనిపించకుండా పోయిన వికారాబాద్ (Vikarabad) జిల్లాకు చెందిన మహిళ విగతజీవిగా మారింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Vikarabad | త్రినేత్ర న్యూస్: గత నెల 18న కనిపించకుండా పోయిన వికారాబాద్ (Vikarabad) జిల్లాకు చెందిన మహిళ విగతజీవిగా మారింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం అమృతమ్మ (34)కు కుల్కచర్లకు చెందిన గంధం భీమయ్యకు 14 ఏండ్ల క్రితం వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు. రెండున్నరేండ్ల క్రితం భర్త మరణించడంతో పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఎం. ఆనంద్ (28)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

అయితే సెప్టెంబర్ 18 నుంచి అమృతమ్మ కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో.. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అమృతమ్మతో సన్నిహితంగా ఉండే ఆనంద్‌పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతడు బుకాయించడంతో.. ఫోన్‌కాల్ లిస్ట్ ముందుపెట్టి ప్రశ్నించడంతో తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నగలు తాకట్టు పెట్టడంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయని.. దీంతో గత నెల 18న ఆమెను బైక్‌పై తీసుకెళ్లి మహబూబ్‌నగర్ జిల్లా గండీడు మండలం వెన్నచేడ్ అడవిలో హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని తగులబెట్టాడు. సగం కాలిపోయిన మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు మహిళకు సంబంధించిన మృతదేహ అవశేషాలు లభించాయి. అనంతరం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ హత్యలో ఆనంద్‌కు బంధువు కూడా సహకరించినట్లు గుర్తించారు.
సంబంధిత వార్తలు

Suicide | భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయిన తల్లి.. తర్వాత ఏమైందంటే
అక్టోబర్ 3, 2026

Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
అక్టోబర్ 3, 2026

Bus Accident | అంత్యక్రియలకు వెళ్తుండగా.. అనంతగిరి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం
- ●Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
- ●Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?
- ●Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్
- ●Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..
- ●Singeetham Srinivasa Rao | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సింగీతం సినిమాలు - అనౌన్స్మెంట్తోనే సంచలనం ..కానీ...

KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం

Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?

Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్



