త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashi Khanna | స‌మంత భ‌ర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖ‌న్నా ఔట్ – టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్‌

బాలీవుడ్ వెబ్‌సిరీస్ ఫ‌ర్జీ 2 నుంచి రాశీఖ‌న్నా త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌మంత భ‌ర్త రాజ్ నిడిమోరు త‌న స్నేహితుడు డీకేతో క‌లిసి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సిరీస్‌లో షాహిద్‌క‌పూర్‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఫ‌ర్జీ 2లో రాశీఖ‌న్నా ప్లేస్‌లో టాలీవుడ్ హీరోయిన్ యుక్తి త‌రేజాను మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Oct 4, 2026, 12.16 pm IST

Raashi Khanna | స‌మంత భ‌ర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖ‌న్నా ఔట్ – టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్‌
Advertisement

Raashi Khanna | ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్‌డీకే రూపొందించిన‌ ఫ‌ర్జీ వెబ్‌సిరీస్ బాలీవుడ్‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇండియాలోనే హ‌య్యెస్ట్ వ్యూస్‌ను సాధించిన వెబ్‌సిరీస్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఫ‌ర్జీ వెబ్‌సిరీస్‌లో షాహిద్‌క‌పూర్‌, విజ‌య్ సేతుప‌తి, రాశీఖ‌న్నాతో పాటు ప‌లువురు స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ ...

ఫ‌ర్జీ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఈ సిరీస్‌ను రాజ్‌డీకే స్వ‌యంగా నిర్మించారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌కు కొన‌సాగింపుగా సీజ‌న్ 2 రాబోతుంది. పార్ట్ వ‌న్‌తో పోలిస్తే మ‌రింత భారీ బ‌డ్జెట్‌, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రాజ్‌, డీకే సెకండ్ సీజ‌న్‌ను నిర్మించ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాశీఖ‌న్నా త‌ప్పుకుందా?

ఫ‌ర్జీ 2కు సంబంధించి ఓ రూమ‌ర్ బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖ‌న్నా త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. సీజ‌న్ వ‌న్‌లో మేఘా వ్యాస్ అనే ఆర్‌బీఐ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాశీఖ‌న్నా క‌నిపించింది. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ క్యారెక్ట‌ర్‌లో డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

యుక్తి త‌రేజా...

ఫ‌ర్జీకి వ‌చ్చిన రెస్పాన్స్‌తో సెకండ్ సీజ‌న్‌లో కూడా రాశీఖ‌న్నా పాత్ర‌ను కంటిన్యూ చేయాల‌ని ద‌ర్శ‌క‌ద్వ‌యం ప్లాన్ చేశారు. కానీ ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌తో బిజీగా ఉన్న రాశీఖ‌న్నా ఈ వెబ్‌సిరీస్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. ఆమె ప్లేస్‌లో టాలీవుడ్ హీరోయిన్ యుక్తి త‌రేజా ఫ‌ర్జీ 2లో క‌నిపించ‌బోతుంది. సీజ‌న్ 2లో షాహిద్ ప్రియురాలిగా యుక్తి త‌రేజా న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం.

రంగ‌బ‌లితో...

నాగ‌శౌర్య రంగ‌బ‌లి మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది యుక్తి త‌రేజా. కిర‌ణ్ అబ్బ‌వ‌రం కే ర్యాంప్‌తో పాటు ఇటీవ‌ల రిలీజైన కేజీక్యూ సినిమాల్లో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డంలో ఓ సినిమా చేస్తోంది.

స‌మంత భ‌ర్త రాజ్ నిడిమోరు త‌న స్నేహితుడుడీకేతో క‌లిసి బాలీవుడ్‌లో కొన్ని సినిమాల‌తో పాటు వెబ్‌సిరీస్‌లు చేశాడు. అయితే సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లు వీరిద్ద‌రికి మంచి పేరుతెచ్చిపెట్టాయి.

 

 

Advertisement
Advertisement