త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌ జిల్లా వాసి మృతి

Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మహబూబాబాద్‌ జిల్లా (Mahabubabad) వాసి మృతి చెందారు. మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ (31) ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

G

Telangana | Published On Oct 4, 2026, 12.44 pm IST

Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌ జిల్లా వాసి మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మహబూబాబాద్‌ జిల్లా (Mahabubabad) వాసి మృతి చెందారు. మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ (31) ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. సుప్రియ‌ (Daram Supriya).. ఉద్యోగ‌రీత్యా అమెరికాలోని మిస్సోరిలో (Missouri) నివాసం ఉంటున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్‌ ఢీకొంది. దీంతో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న భారత్‌కు చెందిన మరో యువతి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆమెకు స్థానిక హాస్పిట‌ల్‌కు చికిత్స అందిస్తున్న‌ట్లు స‌మాచారం.

మృతురాలి భర్త కొదుమూరి రంజిత్‌, అత్తమామలు కొదుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్‌ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. సుప్రియ మ‌ర‌ణ వార్త‌తో ఆ కుటుంబంలో విషాదం నెల‌కొంది. ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం కుటుంబ స‌భ్యులు ఎదురుచూస్తున్నారు. ఆమె మృత‌దేహాన్ని అమెరికా నుంచి భార‌త్‌కు త‌ర‌లించే విష‌యంపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement
Advertisement