త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైద‌రాబాద్‌లో వెల‌సిన ఫ్లెక్సీలు..

Medicover | హైదరాబాద్‌లోని (Hyderabad) ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో వెల‌సిన బ్యాన‌ర్లు (Flex Banners) స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. `కంగ్రాచ్యులేష‌న్స్ రేవంత్ గారు.. రూ.13,200 కోట్లు` అంటూ సికింద్రాబాద్‌లోని మెడిక‌వ‌ర్ (Medicover) ద‌వాఖాన ముందు రోడ్డుకు ఇరువైపులా బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు.

G

Telangana | Published On Oct 4, 2026, 11.22 am IST

Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైద‌రాబాద్‌లో వెల‌సిన ఫ్లెక్సీలు..
Advertisement

Medicover | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్ర రాజ‌కీయాల్లో నాయ‌కుల ఆస్తుల వ్య‌వ‌హారాలు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారాన్ని ఉప‌యోగించుకుని భారీగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టుకుంటున్నారంటూ అధికార విప‌క్షాలు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌లోని (Hyderabad) ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో వెల‌సిన బ్యాన‌ర్లు (Flex Banners) స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. `కంగ్రాచ్యులేష‌న్స్ రేవంత్ గారు.. రూ.13,200 కోట్లు` అంటూ సికింద్రాబాద్‌లోని మెడిక‌వ‌ర్ (Medicover) ద‌వాఖాన ముందు రోడ్డుకు ఇరువైపులా బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు. రూ.13,200 కోట్ల‌కు మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌ను విక్ర‌యించి బ్లాక్ మ‌నీని వైట్‌గా మార్చుకుంటున్నార‌ని అందులో పేర్కొన్నారు. అటుగా వ‌చ్చిపోయే వాహ‌న‌దారులు ఆయా ఫ్లెక్సీల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు.

కాగా, మెడికవర్‌ హాస్పిటల్‌ను విక్రయించి బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకున్నారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మెడికవర్ ఆసుపత్రిలో దుంప శిరీష పేరిట బినామీ పెట్టుబడులు పెట్టి 13 వేల కోట్లకు ఆసుపత్రిని అమ్మేశార‌ని క్రిశాంక్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించని రేవంత్ రెడ్డి... కుటుంబ సభ్యుల పేరిట‌ మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఈ కంపెనీలు అన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

అది సాధార‌ణ‌మే..

మ‌రోవైపు ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి మెడికవర్ హాస్పిటల్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) స‌ర్కార్‌ ఏర్పడక ముందే మెడికవర్ హాస్పిటల్ ఉనికిలో ఉందని, తమ వ్యాపార విస్తరణ కోసం విదేశీ సంస్థలకు వాటాలను అమ్ముకోవడం ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ విషయమేనని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు తమ ఆస్తుల లావాదేవీల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదికూడా చ‌ద‌వండి..

రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవ‌రు?

Advertisement
Advertisement