త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | భ‌ర్త‌తో గొడ‌వ‌.. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో వెళ్లిపోయిన తల్లి.. త‌ర్వాత ఏమైందంటే

Suicide | Suicide | త్రినేత్ర న్యూస్‌: భ‌ర్త‌తో గొడ‌వ ప‌డిన భార్య.. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పేగు తెంచి జ‌న్మ‌నిచ్చిన పిల్ల‌ల కోసమైనా ఒక్క క్ష‌ణం ఆలోచించ‌లేదు.

S

Telangana | Published On Oct 3, 2026, 1.02 pm IST

Suicide | భ‌ర్త‌తో గొడ‌వ‌.. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో వెళ్లిపోయిన తల్లి.. త‌ర్వాత ఏమైందంటే
Advertisement

Suicide | త్రినేత్ర న్యూస్‌: భ‌ర్త‌తో గొడ‌వ ప‌డిన భార్య.. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పేగు తెంచి జ‌న్మ‌నిచ్చిన పిల్ల‌ల కోసమైనా ఒక్క క్ష‌ణం ఆలోచించ‌లేదు. గొడ‌వ‌ల‌తో ఎంత న‌లిగిపోయిందో ఏమో.. క్ష‌ణికావేశంలో పిల్ల‌ల‌తో క‌లిసి బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు ఒడిగ‌ట్టింది. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా పూడూరు మండ‌లం సోమ‌న్‌గూర్తి గ్రామ శివారులో శ‌నివారం ఉద‌యం చోటుచేసుకుంది.

వివ‌రాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలోని మాటుగూడెం గ్రామానికి చెందిన రాజు, మ‌మ‌త (30) దంప‌తులు త‌ర‌చూ గొడ‌వ‌ప‌డేవారు. నిన్న‌ ఉద‌యం మ‌రోసారి గొడ‌వ జ‌ర‌గ‌డంతో కుమార్తె జ‌న‌శ్రీ (4), కుమారుడు సాకేత్‌ (8)ను తీసుకొని మ‌మ‌త ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేప‌థ్యంలో సోమన్‌గూర్తి శివారులోని వ్యవసాయ బావి వద్ద చెప్పులు, బ్యాగ్ కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వ‌చ్చి బావిలో నుంచి మ‌మ‌త‌, జ‌న‌శ్రీ మృత‌దేహాల‌ను బ‌య‌టికి తీశారు. సాకేత్ కోసం ఇంకా గాలింపు కొన‌సాగిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈ విష‌య‌మై కుటుంబ స‌భ్యులు శుక్ర‌వారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కుటుంబ క‌ల‌హాల‌తోనే ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డిందా.. లేదా వేరే ఏవైనా కార‌ణాలు ఉన్నాయ‌నే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement