త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?

Free Bus | మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ద్వారా ఆర్టీసీ బ‌స్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.

G

Telangana | Published On Oct 4, 2026, 12.24 pm IST

Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?
Advertisement

Free Bus | త్రినేత్ర న్యూస్‌: మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ద్వారా ఆర్టీసీ బ‌స్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. సీనియర్‌ సిటిజన్లకు (Senior Citizens) కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న‌ది. వృద్ధుల నుంచి వస్తున్న అభ్యర్థనలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారవాణాపై వారికున్న ఆధారాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న‌ది. ప్ర‌పంచ వ‌యోవృద్ధుల దినోత్స‌వం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఈ మేర‌కు వెళ్ల‌డించారు. వీలైనంత త్వ‌ర‌గా ఉచిత బ‌స్ పాసులు అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పారు.

సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్ అందిస్తే.. దాని ద్వారా వృద్దులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో (TGSRTC) ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు మహిళలకే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు పురుషులకు కూడా అవకాశం కల్పించినట్లు అవుతుంది.

ఎలా అంటే..

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఉచితంగా బ‌స్ పాస్ అందిస్తారు. తద్వారా చార్జీ చెల్లించ‌కుండానే ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించవ‌చ్చు. అయితే ప్ర‌భుత్వం వయో పరిమితిని ఎంతగా నిర్ణయించాల‌నే విష‌యం కీలకంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 60 ఏండ్లు దాటిన వారిని సీనియర్‌ సిటిజన్లుగా పరిగణిస్తారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ వ‌య‌స్సును ప్రామాణికంగా తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి (Congress Govt) వ‌చ్చిన త‌ర్వాత 2023 డిసెంబ‌ర్ 7 నుంచి తెలంగాణ‌ మ‌హిళ‌లంద‌రికీ ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement