త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singeetham Srinivasa Rao | చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో సింగీతం సినిమాలు – అనౌన్స్‌మెంట్‌తోనే సంచ‌ల‌నం ..కానీ…

సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో క‌మ‌ల్‌హాస‌న్‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేశారు లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు. కానీ మెగా హీరోల‌తో ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి కాంబినేష‌న్‌లో ఒక్క సినిమా రాలేదు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో సింగీతం శ్రీనివాస‌రావు చేయాల్సిన సినిమాలు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ఆ సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On Oct 4, 2026, 11.13 am IST

Singeetham Srinivasa Rao | చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో సింగీతం సినిమాలు – అనౌన్స్‌మెంట్‌తోనే సంచ‌ల‌నం ..కానీ…
Advertisement

Singeetham Srinivasa Rao |ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌యోగాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు. క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా ఆయ‌న చేసిన‌న్నీ ప్ర‌యోగాలు మ‌రే ద‌ర్శ‌కుడు చేయ‌లేదు. క‌మ‌ల్‌హాస‌న్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి స్టార్ హీరోలంద‌రితో సింగీతం శ్రీనివాస‌రావు తెర‌కెక్కించిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. కానీ మెగా హీరోల‌తో సినిమాలు చేయాల‌నే ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి క‌ల మాత్రం నెర‌వేర‌లేదు. చిరంజీవితో ఓ సోషియో ఫాంట‌సీ మూవీ...ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మైథాల‌జీ సినిమాల‌ను సింగీతం అనౌన్స్ చేశారు.అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ మ‌ధ్య‌లోనే ఈ సినిమాలు ఆగిపోయాయి.

భూలోక‌వీరుడు....

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి కంటే ముందు చిరంజీవీ హీరోగా నిర్మాత అశ్వ‌నీద‌త్ ...భూలోక‌వీరుడు పేరుతో ఓ భారీ బ‌డ్జెట్ సోషియో ఫాంట‌సీ మూవీని నిర్మించాల‌ని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ట‌బును హీరోయిన్‌గా తీసుకున్నారు. ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు. రెండు షెడ్యూల్స్‌ షూటింగ్ కూడా పూర్త‌య్యింది. చిరంజీవి, ట‌బుల‌పై ఓ డ్యూయెట్ సాంగ్‌ను షూట్ చేశారు. కానీ క‌థ విష‌యంలో చిరంజీవితో పాటు అశ్వ‌నీద‌త్‌ అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం...అనుకున్నదానికంటే బ‌డ్జెట్ పెరిగిపోవ‌డంతో భూలోక‌వీరుడు షూటింగ్‌ను ఆపేశారు. అలా చిరంజీవితో సింగీతం చేయాల్సిన సోషియో ఫాంట‌సీ మూవీ మిస్స‌య్యింది.

ప్రిన్స్ ఆఫ్ పీస్‌...

2010లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ ఆఫ్ పీస్ పేరుతో ఓ మైథాల‌జీ మూవీని అనౌన్స్‌చేశారు. ప్ర‌క‌ట‌న‌తోనే పాన్ ఇండియ‌న్ వైడ్‌గా ఈ సినిమాపై భారీగా బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఏసుక్రీస్తు జీవితంలోని కొన్ని ముఖ్య ఘ‌ట్టాల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు సింగీతం ప్ర‌క‌టించారు. జోర్డాన్, ఇజ్రాయిల్‌ల‌లో షూటింగ్‌, హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లోనే భారీ వ్య‌యంతో ఈ సినిమాను రూపొందించాల‌ని సింగీతం అనుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ డేట్స్‌తో పాటు నిర్మాణ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల అనౌన్స్‌మెంట్‌తోనే ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆగిపోయింది.

 

 

Advertisement
Advertisement