త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | ఆ మొత్తం వీడియో ఫుటేజీ ఇవ్వండి.. ఎథిక్స్ క‌మిటీ చైర్మ‌న్‌ను కోరిన మాజీ మంత్రి వేముల‌

Vemula Prashanth Reddy | గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీలో సీనియ‌ర్ శాస‌న స‌భ్యుడు క‌డియం శ్రీహ‌రి ప‌ట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వ్య‌వ‌హ‌రించిన తీరుపై చ‌ర్చించేందుకు ఎథిక్స్ క‌మిటీ (Ethics Committee) స‌మావేశ‌మైంది.

G

Telangana | Published On Sep 30, 2026, 12.37 pm IST

Vemula Prashanth Reddy | ఆ మొత్తం వీడియో ఫుటేజీ ఇవ్వండి.. ఎథిక్స్ క‌మిటీ చైర్మ‌న్‌ను కోరిన మాజీ మంత్రి వేముల‌
Advertisement

Vemula Prashanth Reddy | త్రినేత్ర న్యూస్‌: గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీలో సీనియ‌ర్ శాస‌న స‌భ్యుడు క‌డియం శ్రీహ‌రి ప‌ట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వ్య‌వ‌హ‌రించిన తీరుపై చ‌ర్చించేందుకు ఎథిక్స్ క‌మిటీ (Ethics Committee) స‌మావేశ‌మైంది. క‌మిటీ చైర్మ‌న్ రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగుతున్న‌ది. అయితే స‌మావేశానికి మాజీ మంత్రి వేముల ప్ర‌శాంతి రెడ్డి (Vemula Prashanth Reddy) హాజ‌రు కాలేక‌పోయారు. త‌మ బంధువులు మ‌ర‌ణించ‌డంతో హాజ‌రు కాలేక‌పోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఎజెండాలోని అంశాలపై తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ చైర్మన్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

2026, మార్చి 29న కడియం శ్రీహరికి (Kadiyam Srihari), ట్రెజరి బెంచ్ నుంచి సభ్యులకు, కౌశిక్ రెడ్డికి మధ్య జరిగిన సంఘటనకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్‌ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇవ్వాల‌న్నారు. ఆయ‌న కోరినట్టు స‌మాధానం ఇవ్వడానికి 6 వారాల సమయం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గతంలో తాను ఇచ్చిన 6 పిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement