Padi Kaushik Reddy | ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
Padi Kaushik Reddy | రాష్ట్రంలో కొత్త పెన్షన్ (New Pensions)లు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మోసం చేస్తున్నారని.. అందుకు నా హుజురాబాద్ నియోజకవర్గమే ఉదాహరణ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు.
- అబద్ధాలు చెప్పినందకు రేవంత్ రాజీనామాకు సిద్ధమా?
- కొత్తవి ఇస్తున్నామని రేవంత్ మోసం చేస్తుండు.. దానికి నా నియోజకవర్గమే ఎగ్జాంపుల్
- లెక్కలు తప్పు అని తేలితే ముక్కు నేలకు రాస్తా
- వర్షాలు పడకపోవడానికి కారణం రేవంత్‌రెడ్డే
- ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర విమర్శలు
Padi Kaushik Reddy | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో కొత్త పెన్షన్ (New Pensions)లు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మోసం చేస్తున్నారని.. అందుకు నా హుజురాబాద్ నియోజకవర్గమే ఉదాహరణ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. హుజురాబాద్‌లో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. లెక్కలు తప్పు అని తేలితే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు పడకపోవడానికి కారణం రేవంత్‌రెడ్డే అని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గంలో 1029 పెన్షన్లు ఉల్టా తొలగించారని మండిపడ్డారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని మండలాల్లో భారీగా పెన్షన్లు కోత పెట్టారు. రేవంత్ రెడ్డి! లబ్ధిదారులను ఎలా మోసం చేయాలనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెన్షన్లు పెంచిన ఘనత కేసీఆర్ ది. 45 లక్షల పెన్షన్లు కేసీఆర్ ఇచ్చారు. మేం కొత్తగా ఇచ్చామని జనాన్ని మోసం చేస్తున్నారు. మోసం చేయడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గు ఉండాలి. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? రాష్ట్రంలో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు.
నువ్ కొడంగల్‌లో గెలువు..
సిద్దిపేటలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. నువ్వు కొడంగల్‌లో మా నరేందర్ రెడ్డిపై గెలువు. హరీశ్ రావుకు, నీకు పోలిక ఎక్కడిది? హరీశ్‌రావు ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు బ్యాండ్ కొడుతూ వెళ్లిన సందర్భం మర్చిపోయావా? సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి కంటే ఒక్క ఇంచు ఎక్కువైన అభివృద్ధి కొడంగల్ లో చేసావా? రేవంత్ రెడ్డి భాష చూసి జనం చీదరించుకుంటున్నారు. రేవంత్ రెడ్డిది ఏం భాష ఏం రోత ప్రవర్తన అని. ఆయన దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే వర్షాలు పడడం లేదు అని కౌశిక్‌రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
- ●Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
- ●US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!
- ●Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు
- ●Chamala Kirankumar Reddy | హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడ్తడు
- ●Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!
- ●PM Modi | ఆలోచనల్లోని హద్దులను చెరిపేస్తేనే దేశం అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది : ప్రధాని మోదీ

Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్

US Green Card for H1B children | H-1B ఉద్యోగుల పిల్లలకు అమెరికా గ్రీన్ కార్డ్! 21 ఏళ్ల గండం గట్టెక్కించే కొత్త బిల్లు.. అర్హతలివే!

Manchirevula | మంచిరేవుల దగ్గర ‘ఘర్ ఎ ముబారక్’ గుట్టల్లో ఎరుపు రంగు రాతలు

Chamala Kirankumar Reddy | హరీశ్‌రావు, కేటీఆర్ డబ్బింగ్ చెప్తే కిషన్ రెడ్డి మాట్లాడ్తడు





