Vemula Prashanth Reddy | సీఈసీకి మద్దతుగా బీజేపీ ర్యాలీలెందుకు.. దీని వెనకున్న మతలబు ఏంటి?
Vemula Prashanth Reddy | స్వయం ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘాని(CEC)కి మద్దతు బీజేపీ ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తోందని మాజీ మంత్రి వేమలు ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy) ప్రశ్నించారు.
- జ్ఞానేశ్‌కుమార్‌ను బీజేపీకి అనుకూలంగా పని చేసే వ్యక్తిగా మార్చాలనుకుంటున్నారా?
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూటి ప్రశ్నలు
Vemula Prashanth Reddy | త్రినేత్ర న్యూస్: స్వయం ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘాని(CEC)కి మద్దతు బీజేపీ ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తోందని మాజీ మంత్రి వేమలు ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy) ప్రశ్నించారు. దీని వెనకున్న మతలబు ఏంటో ప్రధాని మోదీ, బీజేపీ (BJP) సమాధానం చెప్పాలన్నారు. లోక్ తంత్ర బచావో ర్యాలీ (Rally) లాంటివి చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. భారత ఎన్నికల కమిషన్ ను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే వ్యవస్థగా మార్చాలనుకుంటున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
భారతదేశంలో పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా అనేక ప్రశ్నలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో స్పందించాల్సిన ఎన్నికల కమిషన్‌కు బదులుగా బీజేపీ పార్టీ ఎన్నికల కమిషన్ కు మద్దతుగా ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తోంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్‌పై వస్తున్న సందేహాలకు స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ తమ సచ్చీలతను నిరూపించుకోవడానికి సమాధానాలు చెప్పాలి. బీజేపి వ్యవహరిస్తున్న ఈ తీరువల్ల ప్రజాస్వామ్యం కాపాడబడుతుందా లేదా ఖూనీ చేయబడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ పార్టీపై లేదా?
ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గతంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ జేజే థామస్ (JJ Thomas) కు బీజేపీ తరఫున ఎంపీ పదవి, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు స్వయంగా జేజే థామస్ చెప్పారు. ఈ సందర్భంలో ఎన్నికల కమిషనర్ విశ్వశనీయత ప్రశ్నార్థకం అయినట్టు కాదా?
స్వయంగా తప్పుకోవాలి
జ్ఞానేశ్‌కుమార్ బీజేపి పార్టీ తరఫున పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అందువల్ల ఈ దేశ ఎన్నికల వ్యవస్థకు అధిపతిగా ఉండే నైతిక హక్కు ఆయనకు ఎక్కడిది? దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసినట్టుగా వెంటనే జ్ఞానేశ్ కుమార్ తన బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకోవాలి. లేదంటే ఆయనను కేంద్ర ప్రభుత్వం తొలగించాలి అని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్ - పుకార్లకు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగర్
- ●Vivek Venkata Swamy | ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్
- ●Parliament | 30 నుంచి పార్లమెంట్ సమావేశాలు
- ●CM Revanth Reddy | నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను..
- ●Komatireddy Venkat Reddy | ఆ ఆంధ్రా అధికారే మమ్మల్ని తప్పుదోవ పట్టిచ్చిండు
- ●Alias Rukmini Trailer | బూతు నవలల రచయితగా నితిన్ - అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్

Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్ - పుకార్లకు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగర్

Vivek Venkata Swamy | ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్

Parliament | 30 నుంచి పార్లమెంట్ సమావేశాలు

CM Revanth Reddy | నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను..



