Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..
Youtuber Haribabu | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును నిన్న సాయంత్రం నిజామాబాద్‌లో అత్యంత దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Youtuber Haribabu | త్రినేత్ర.న్యూస్ : యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును నిన్న సాయంత్రం నిజామాబాద్‌లో అత్యంత దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడు సెల్పీ వీడియో విడుదల చేసి.. కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన చెల్లిని చంపినందుకే ప్రతీకారంగా హరిబాబును అంతమొందిచినట్లు ఆయన పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చి నెలలో యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురయ్యారు. వైష్ణవి హత్య కేసులో హరిబాబు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు.
నాకు శిక్ష పడకుండా చూడండి : వైష్ణవి సోదరుడు
నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి. మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను.. వాళ్లు న్యాయం చేయలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. మీ కాళ్లు మొక్కుతా, మీకు దండం పెడుతా నాకు సపోర్ట్ చేసి నన్ను త్వరగా బయటికి తీసుకురండి.. నాకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు అని నిందితుడు సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు.
నా భర్త బయటకు రావాలని సపోర్ట్ చేయండి : నిందితుడి భార్య
మా ఆయన హత్య చేయడం కరెక్టా కాదా మీరే చెప్పాలి. నన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది. కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉంది. నా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి అని వైష్ణవి సోదరుడి భార్య పేర్కొంది.
నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి
మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేశానని సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంతోష్
తన చెల్లిని చంపిన హరిబాబును హత్య చేయడం సంతోషంగా ఉందని సెల్ఫీ వీడియో… https://t.co/ooYqCBxGiJ pic.twitter.com/2F78UV6lJc
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
తాజావార్తలు
- ●KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!
- ●Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ●Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం
- ●Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!
- ●Sun Transit 2026 | కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్లో పురోగతి..!
- ●Ravinder Rao | సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్రావు లీగల్ నోటీసు

KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!

Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం

Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!





