త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmapuri Arvind | ఒక్క‌సారి బీజేపీ వ‌స్తే.. క్వింటా పసుపు ధ‌ర‌ 50 వేలు చూపిస్తా

Dharmapuri Arvind | తెలంగాణ‌లో బీజేపీ ఒక్కసారి గెలిస్తే క్వింటా పసుపు ధ‌ర (Turmeric Price) రూ.50 వేలు చూపిస్తామ‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ (Dharmapuri Arvind) అన్నారు.

S

Telangana | Published On Nov 26, 2026, 5.58 pm IST

Dharmapuri Arvind | ఒక్క‌సారి బీజేపీ వ‌స్తే.. క్వింటా పసుపు ధ‌ర‌ 50 వేలు చూపిస్తా
Advertisement
  • రేవంతుకు ఏం రాదు.. టోట‌ల్ గుడ్డోడు
  • ఇప్ప‌టికీ 22ఏ నుంచి ఒక్క గ‌జం కూడా తీయ‌లే
  • రోడ్ల మీద ధాన్యముంటే కేసీఆర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాలే
  • నిజామాబాద్‌ ఎంపీ ధ‌ర్మ‌పురి అరవింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Dharmapuri Arvind | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ‌లో బీజేపీ ఒక్కసారి గెలిస్తే క్వింటా పసుపు ధ‌ర (Turmeric Price) రూ.50 వేలు చూపిస్తామ‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ (Dharmapuri Arvind) అన్నారు. ఇప్పుడు ట్రేడ‌ర్స్ చూస్తున్నార‌ని.. మేమొస్తే రైతులే ఈ ధ‌ర చూస్తార‌ని చెప్పారు. రోడ్ల మీద ధాన్యం ఆర‌బోస్తే కేసీఆర్ (KCR) ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇగ రేవంతు(Revanth Reddy)కు ఏం రాద‌ని.. టోట‌ల్ గుడ్డోడ‌ని ఎద్దేవా చేశారు. 22ఏ (22A) నుంచి ఈరోజు వ‌ర‌కు ఒక్క గ‌జం కూడా తీసేయ‌లేద‌ని తెలిపారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు గుప్పించారు.

రోజుకు 50 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్లు..

ఒక్క‌సారి బీజేపీ వ‌స్తే రైతు క్వింటా పసుపుకు రూ.50 వేల ధ‌ర సూస్త‌డు.. ట్రేడ‌ర్ కాదు. ఇవాళ ఎక్కువ శాతం ట్రేడ‌ర్ సూస్తున్న‌డు. రేపు రైతు సూస్త‌డు. పైస‌లేస్క‌పోవాలే, 22ఏ వెట్టాలే, నిజామాబాద్‌ల బిల్డింగు క‌ట్టుకున్నోడు వోయి పైస‌లియ్యాలే. రోజుకు 50 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్లు జిల్లాల‌ల్ల‌. ఇదా నీ పరిపాల‌న‌? మొత్తం 22ఏ తీసేస్త‌మ‌న్న‌డు. రెవెన్యూ మినిస్ట‌ర్‌, ముఖ్య‌మంత్రి క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క గ‌జం గూడా తీయ‌లే.

నీకు బుర్ర ఉండి ప‌ని చేసిన‌వా?

ధాన్యం రోడ్డు మీద ఆర‌వోసుకుంటే కేసీఆర్ ఫ‌స్ట్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాలే. నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ అన్నవ్‌.. నీ త‌ల‌కాయ గ‌వ‌ర్నెన్స్ చేసిన‌వా? నీకు బుర్ర ఉండి ప‌ని చేసిన‌వా? సెక్ర‌టేరియ‌ట్ రానోనివి, అసెంబ్లీకి రానోనివి ఏం మొఖం పెట్టుకొని మ‌ళ్ల ప్ర‌జ‌ల ముందుకు వ‌స్త‌వ్‌? ధాన్యం రోడ్ల మీద ఆర‌వెడుతుంటే నువ్ ఏం మొఖం బెట్టుకొని రోడ్ల మీద తిరుగుత‌వ్‌? 10 సంవ‌త్స‌రాలు నువ్ పీకింది ఏంది? ఇగ వీడైతే టోట‌ల్ గుడ్డోడు రేవంతు. ఏం రాదు జీరో అడ్మినిస్ట్రేష‌న్ అంటూ త‌న‌దైన స్టైల్‌లో సెటైర్లతో విరుచుకుప‌డ్డారు.

Advertisement
Advertisement