Kishan Reddy | భారత్‌లో కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడవదు
Kishan Reddy | భారత్ ఏమైనా సోనియా గాంధీ( Sonia Gandhi ) కుటంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీనా? భారత్‌లో కాంగ్రెస్( Congress ) మార్కు, నియంతృత్వపు రాజకీయం నడవదు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి( Kishan Reddy ) తేల్చిచెప్పారు.
భారత్ ఏమైనా సోనియా కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీనా..?
కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఈసీ, సీజేఐదా..?
ఢిల్లీలో ఓ నీతి.. తెలంగాణకు మరో నీతా..?
కాంగ్రెస్ నేతలను నిలదీసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy | త్రినేత్ర న్యూస్ : భారత్ ఏమైనా సోనియా గాంధీ( Sonia Gandhi ) కుటంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీనా? భారత్‌లో కాంగ్రెస్( Congress ) మార్కు, నియంతృత్వపు రాజకీయం నడవదు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి( Kishan Reddy ) తేల్చిచెప్పారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు సీజేఐ కూడా గద్దె దిగాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే.. ఎన్నికల సంఘం, సీజేఐది బాధ్యతా..? ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఈసీ, సీజేఐదా..? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పులు ఇవ్వలేదని చీఫ్ జస్టిస్‌ని బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక ప్రజాస్వామ్య హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు స్వేచ్ఛగా నిరసనలు చేస్తుంటే అనుమతిస్తున్నామని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం బీజేపీ నేతల నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణలో రైతుల సమస్యలు, పోలీసు నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వంటి ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో సహా పలువురు నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రధాని మోదీని, ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థను, సైన్యాన్ని విమర్శిస్తున్నా ఆయన హక్కులను కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆయన గుర్తుచేశారు.
తాజావార్తలు
- ●ICC Women's ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..
- ●Defamation Case | రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సిందే..!
- ●Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం
- ●AIADMK MLAs Resignation | ఆ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం సరైనదే.. స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●NPCI | దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు
- ●Ranabaali Censor Review | రణబాలి సెన్సార్ రివ్యూ - జీరో కట్స్ - రఫ్పాడించిన విజయ్ - యాక్షన్ ఫీస్ట్

ICC Women's ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..

Defamation Case | రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సిందే..!

Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం

AIADMK MLAs Resignation | ఆ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం సరైనదే.. స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్





