త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medak | మెద‌క్ జిల్లాలో విషాదం.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే వ‌దిన, మ‌ర‌ద‌లు మృతి

Medak | వారిద్ద‌రూ వ‌దిన మ‌ర‌ద‌ళ్లు. అంతేకాదు ఇద్ద‌రూ కూడా బాలింత‌లే. మ‌ర‌ద‌లు ప్రాణాలు కోల్పోయిన కొన్ని గంట‌ల‌కే వ‌దిన కూడా మృతి చెందింది.

S

Telangana | Published On May 23, 2026, 5.03 pm IST

Medak | మెద‌క్ జిల్లాలో విషాదం.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే వ‌దిన, మ‌ర‌ద‌లు మృతి
Advertisement

Medak | త్రినేత్ర‌.న్యూస్ : వారిద్ద‌రూ వ‌దిన మ‌ర‌ద‌ళ్లు. అంతేకాదు ఇద్ద‌రూ కూడా బాలింత‌లే. మ‌ర‌ద‌లు ప్రాణాలు కోల్పోయిన కొన్ని గంట‌ల‌కే వ‌దిన కూడా మృతి చెందింది. ఈ విషాద ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రెడ్డిప‌ల్లికి చెందిన కే స్వాతి(26) ప్ర‌స‌వం నిమిత్తం నెల రోజుల‌ క్రితం చందంపేట వెళ్లింది. చందంపేట వారి త‌ల్లిదండ్రుల ఊరు. పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే శుక్ర‌వారం రాత్రి స్వాతి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో ఆమెను హుటాహుటిన మెద‌క్‌లోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆమె క‌న్నుమూసింది.

స్వాతి మృతి చెందిన విష‌యం తెలుసుకున్న ఆమె వ‌దిన సౌంద‌ర్య‌(27) కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. సౌంద‌ర్య కూడా నెల రోజుల క్రితం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. స్వాతి మృతితో సౌంద‌ర్య అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లింది. శ‌నివారం ఉద‌యం మృతి చెందింది. దీంతో కుటుంబ స‌భ్యులు షాక్‌కు గుర‌య్యారు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే వ‌దిన‌మ‌ర‌ద‌ళ్లు మృతి చెంద‌డం జిల్లాలో చ‌ర్చానీయాంశ‌మైంది.

Advertisement
Advertisement