త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain | హైద‌రాబాద్‌లో అక్క‌డక్క‌డ భారీ వ‌ర్షం.. ప‌లు జిల్లాల్లో కూడా..

Rain | గ‌త కొన్ని రోజుల‌గా మండే ఎండ‌ల‌తో అల్లాడుతున్న హైద‌రాబాద్ (Hyderabad) వాసుల‌కు భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. న‌గ‌రంలోని ప‌లు చోట్ల అర్ధ‌రాత్రి నుంచి వ‌ర్షం (Rain) కురుస్తున్న‌ది.

G

Telangana | Published On May 27, 2026, 6.25 am IST

Rain | హైద‌రాబాద్‌లో అక్క‌డక్క‌డ భారీ వ‌ర్షం.. ప‌లు జిల్లాల్లో కూడా..
Advertisement

Rain | హైద‌రాబాద్‌: గ‌త కొన్ని రోజుల‌గా మండే ఎండ‌ల‌తో అల్లాడుతున్న హైద‌రాబాద్ (Hyderabad) వాసుల‌కు భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. న‌గ‌రంలోని ప‌లు చోట్ల అర్ధ‌రాత్రి నుంచి వ‌ర్షం (Rain) కురుస్తున్న‌ది. లింగంప‌ల్లి, గ‌చ్చిబౌలి, కుత్బుల్లాపూర్‌, మియాపూర్‌, మాదాపూర్‌, చందాన‌గ‌ర్‌, రాయ‌దుర్గం, కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్‌, మ‌ల్కాజిగిరి, సికింద్రాబాద్‌, బోయిన్‌ప‌ల్లి, సుచిత్ర‌, శేరిలింగంప‌ల్లి, కాప్రా, అల్వాల్‌, ఎల్బీన‌గ‌ర్‌, ఉప్ప‌ల్‌, మ‌ల‌క్‌పేట్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌, జీడిమెట్ల‌, గాజుల‌రామారం, నిజాంపేట‌లో ఈదురుగాలుల‌తో కూడిన‌ వ‌ర్షం కురిసింది. ప‌లు ప్రాంతాల్లో జ‌ల్లులు ప‌డుతున్నాయి.

న‌గ‌రంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాలో అర్ధరాత్రి భారీగా వ‌ర్షం కురిసింది. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట‌, వికార‌బాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల‌, మెద‌క్‌, న‌ల్ల‌గొండ‌ త‌దిత‌ర జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. మెద‌క్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం త‌డిసిపోయింది.

Advertisement
Advertisement