Ponnam Prabhakar | పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి పొన్నం
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలి అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారని మండిపడ్డారు.
మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోం..
బీజేపీతో లోపాయికారి ఒప్పందం
ఈ క్రమంలోనే నవ నిర్మాణ సభ
విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదు
పవన్ కళ్యాణ్‌పై మంత్రి పొన్నం ఫైర్
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలి అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. భారతీయులుగా ఇతర రాష్ట్రాలను గౌరవించాలి.. అవమాన పరుచుకోవద్దు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా పాల్గొనచ్చు. ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రిగా చేయలేనిది ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఎవరు వినడానికి సిద్దంగా లేరు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినను అన్న వెధవ వచ్చి ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోం అని పొన్నం తేల్చిచెప్పారు.
కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పు
వాస్తవంగా పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలని బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని పవన్ కళ్యాణ్ ఈ నటన స్టార్ట్ చేశారు. బీజేపీ రెన్యుమనేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పు పవన్ కళ్యాణ్. మాకు అస్సాం కంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర.. ఆంధ్రప్రదేశ్‌తో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటాం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారు. నవ నిర్మాణ సభ గుజరాత్, కేరళ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదు. బీజేపీ డైరెక్షన్‌లో తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే ఊరుకోవద్దు..
పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఏం నటన చేయమంటే అది చేస్తాడు. మీరు సినిమా నటులు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ తెలంగాణపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన వ్యక్తి వహిస్తే సహించం. పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా చూడండి కానీ మన తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే ఊరుకోవద్దు. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పేరు వెనుక ఆంతర్యం ఏమిటి..? బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టడమే మీరు స్థాపించే నవనిర్మాణమా? మీకు ఏపీ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చారు. అక్కడ చూపించండి మీ నవనిర్మాణం అని మంత్రి పొన్నం సూచించారు.
అణువణువునా తెలంగాణ వ్యతిరేకత
తెలంగాణలో సభ ఏర్పాటు చేయాలి. నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి. ఇక్కడ జనాలు తన్నుకు చావాలి . ఇదేనా మీ పవనిజం? అణువణువునా తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్ మొదట తెలంగాణ వాదులకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్. ఇక్కడ విద్వేష రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదు. చేగువేరా టీ షర్టుతో ప్రారంభమైన ప్రస్థానం.. ఇప్పుడు మోదీని కౌగిలించుకొని ప్రజల చేత ఛీకొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడని మంత్రి మండిపడ్డారు.
తెలంగాణలో నువ్వు ఉద్ధరించేది ఏంటి..?
తెలంగాణలో నువ్వు ఉద్ధరించేది ఏంటి పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఆదుకో. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే గుడ్లు అప్పగించి చూసింది నువ్వు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీకి కట్టబెట్టిన మోదీని ప్రశ్నించని చేతగానితనం నీది. దేశంలో పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతుంటే మారు మాట్లాడనిది నువ్వు. జనగణనలో కులగన చేపట్టకపోతే నోరు మెదపనిది నువ్వు. సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు నిజ జీవితంలో దేశభక్తి చూపించు పవన్ కళ్యాణ్. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారు. మీ ఫ్యాన్స్ చాలామంది నిరుద్యోగులే ఉన్నారు. చేతనైతే వారికి ఉద్యోగాలు ఇప్పించు. కేవలం జై జైలు కొట్టించుకొని పస్తులు ఉంచడం తగదు అని పవన్ కళ్యాణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలంటించారు.
సంబంధిత వార్తలు

Mahabubabad | అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్.. చెప్పుతో చితక్కొట్టిన మహిళ
జూన్ 1, 2026

TG Weather | తెలంగాణ వాసులకు ఐఎండీ గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో నాలుగైదు రోజులు వర్షాలు..!
జూన్ 1, 2026

CID Chief Charu Sinha | ఆన్ లైన్ బెట్టింగ్‌పై సిట్ వేశాం.. 11 మందిని అరెస్ట్ చేశాం: సీఐడీ చీఫ్ చారుసిన్హా
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్రహాలు పెట్టడంలో ఆంతర్యమేంటి?: అల్లం నారాయణ
- ●Iran War | 20కిపైగా సైనిక స్థావరాలు ధ్వంసం.. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
- ●Kinetics 8K | విద్యుత్ లేకపోయినా నెట్ ఆగదు.. పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ విడుదల..
- ●Vaibhav Sooryavanshi IPL 2026 | 15 ఏళ్ల వయసుకే రూ.2.5 కోట్ల సంపాదన.. టోర్నీని శాసించిన వైభవ్ సూర్యవంశీ
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.4.26 లక్షల కోట్ల సంపద ఆవిరి..
- ●Mahabubabad | అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్.. చెప్పుతో చితక్కొట్టిన మహిళ

Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్రహాలు పెట్టడంలో ఆంతర్యమేంటి?: అల్లం నారాయణ

Iran War | 20కిపైగా సైనిక స్థావరాలు ధ్వంసం.. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం

Kinetics 8K | విద్యుత్ లేకపోయినా నెట్ ఆగదు.. పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ విడుదల..

Vaibhav Sooryavanshi IPL 2026 | 15 ఏళ్ల వయసుకే రూ.2.5 కోట్ల సంపాదన.. టోర్నీని శాసించిన వైభవ్ సూర్యవంశీ



