Shivani Nagaram | కోలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అచ్చ తెలుగు బ్యూటీ
లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివానీ నగరం కోలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్, టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిషన్ జీవంత్ హీరోలుగా నటిస్తోన్న తమిళ మూవీ సోమవారం లాంఛ్ అయ్యంది. ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Jun 1, 2026, 2.01 pm IST
Shivani Nagaram | కోలీవుడ్‌లో అచ్చ తెలుగు బ్యూటీలా హవా కొనసాగుతోంది. సాన్వీ శ్రీ వాత్సవ, కయల్ ఆనంది, శివాత్మిక రాజశేఖర్, శ్రీ గౌరిప్రియ ఇలా చాలా మందే తెలుగు అమ్మాయిలు కోలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ శివానీ నగరం తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. లిటిల్ హార్ట్స్, అంబాజీ పేట మ్యారేజీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో బంపరాఫర్ అందుకుంది. టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిషన్ జీవంత్‌తో ఓ సినిమా చేయబోతుంది.
తండ్రీకొడుకుల అనుబంధం..
శివరాజ్‌కుమార్, అభిషన్ జీవంత్ హీరోలుగా గౌతమ్ శివరామన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయ్యింది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శివానీ నగరం, యోగలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌లో శివానీ నగరం పాల్గొన్నది.
త్వరలో షూటింగ్...
విత్ లవ్ బ్లాక్‌బస్టర్ తర్వాత అభిషన్ జీవంత్ హీరోగా నటిస్తోన్న ఈ తమిళ మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది.
లిటిల్ హార్ట్స్....
అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది శివానీ నగరం. లిటిల్ హార్ట్స్ మూవీతో పెద్ద విజయాన్ని అందుకుంది. శివానీ నగరం హీరోయిన్‌గా నటించిన హే బల్‌వంత్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూన్ 4న రిలీజ్ కానున్న రామ్‌చరణ్ పెద్దిలో శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●India Oman CEPA | గల్ఫ్ ట్రేడ్‌లో గేమ్ ఛేంజర్ 'ఇండియా-ఒమన్ CEPA': హార్ముజ్ టెన్షన్స్‌కు చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ రూట్!
- ●SIP | 45 ఏళ్లకే కోటీశ్వరులు కావాలంటే.. ఎస్ఐపీలో ఇలా చేయవచ్చు..
- ●Tripti Dimri | బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్‌లో వివాదం - సినిమా రిలీజ్ అంటేనే భయమేస్తుందంటూ త్రిప్తి డిమ్రి కామెంట్స్
- ●CP Sumathi | పచ్చదనం బాగుంది.. ప్రజలకు పారదర్శక సేవలు అందించండి: సీపీ సుమతి
- ●Sanath Nagar TIMS | 'టిమ్స్' మార్చురీ తరలించండి.. సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి
- ●Indian Origin Pilot | హనీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి

India Oman CEPA | గల్ఫ్ ట్రేడ్‌లో గేమ్ ఛేంజర్ 'ఇండియా-ఒమన్ CEPA': హార్ముజ్ టెన్షన్స్‌కు చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ రూట్!

SIP | 45 ఏళ్లకే కోటీశ్వరులు కావాలంటే.. ఎస్ఐపీలో ఇలా చేయవచ్చు..

Tripti Dimri | బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్‌లో వివాదం - సినిమా రిలీజ్ అంటేనే భయమేస్తుందంటూ త్రిప్తి డిమ్రి కామెంట్స్

CP Sumathi | పచ్చదనం బాగుంది.. ప్రజలకు పారదర్శక సేవలు అందించండి: సీపీ సుమతి






