Police 30 Act | ఈ నెల 30 వరకు మెదక్ జిల్లాలో సెక్షన్ 30, 30(ఎ) అమలు
Police 30 Act | శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మెదక్ జిల్లా (Medak) వ్యాప్తంగా సెక్షన్ 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 (Police 30 Act) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ ఆక్షలు జూన్ 30 వరకు అమలులో ఉంటాయని చెప్పారు.
Police 30 Act | త్రినేత్ర.న్యూస్: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మెదక్ జిల్లా (Medak) వ్యాప్తంగా సెక్షన్ 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 (Police 30 Act) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ ఆక్షలు జూన్ 30 వరకు అమలులో ఉంటాయని చెప్పారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు. అలాగే ప్రజల లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఇలాంటి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
కఠిన చర్యలు..
శాంతిభద్రతల నిర్వహణకు భంగం కలిగించే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖ చేపడుతున్న శాంతిభద్రతల చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

నిర్మల్ జిల్లాలోనూ..
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడానికి జూన్ ఆఖరి వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని, శాంతికి భంగం కల్గించడం, పబ్లిక్ స్థలాల్లో డీజేలు, మ్యూజిక్‌లు, ప్రసంగాలు నిషేధమని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టవద్దని ఆమె హెచ్చరించారు. అలాగే కత్తులు, చాకులు, దుడ్డు కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు తదితర నిషేధిత ఆయుధాలు తీసుకెళ్లడం, వినియోగించడం పూర్తిగా నిషేధమన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
- ●AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?
- ●CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు
- ●Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- ●Cabinet Expands | బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
- ●Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?

AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?

CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్

Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ






