Electric Shock | అర్ధరాత్రి దావత్.. పోలీసులను చూసి పరిగెత్తి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
త్రినేత్ర న్యూస్: కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు (Engineering Students) ఓ పొలంలో దావత్ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి 2 గంటలు అవుతున్నది.
Electric Shock | త్రినేత్ర న్యూస్: కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు (Engineering Students) ఓ పొలంలో దావత్ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి 2 గంటలు అవుతున్నది. అంతా సరదాగా మందు తాగుతున్నారు. అదేసమయంలో అటుగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో పందుల కోసం పెట్టింటిన విద్యుత్ తీగలు (Electric Shock) తగిలి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలంలో జరిగింది.
చిలుకూరులోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం సమీపంలోని వ్యవసాయ పొలంలో మద్యం సేవిస్తున్నారు. రాత్రి 2 గంటల సమయంలో అటుగా పోలీసు పెట్రోలింగ్ వాహనం (Police Patrolling) వచ్చింది. దీంతో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పరుగులు పెట్టారు. దీంతో పొలంలో అడవి పందుల నివారణ కోసం ఏర్పాటు చేసిన తీగలు తగలడంతో రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్ పల్లికి చెందిన మోక్షచరణ్ (20), బల్కంపేటకు చెందిన యశ్వంత్ (20) మృతి చెందారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్
- ●Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
- ●PM Modi | జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ అభినందన
- ●Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?
- ●AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు
- ●Massive Fire | షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం

Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్

Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

PM Modi | జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ అభినందన

Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?






