త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electric Shock | గుట్కా న‌మిలి.. క‌రెంట్ తీగ‌పై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు

Electric Shock | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) విదిశా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుట్కా న‌మిలిన (Spitting Gutka) ఓ వ్య‌క్తి ఇంటి బాల్క‌నీ నుంచి దానిని ఉమ్మేశాడు.

G

National | Published On Oct 26, 2026, 11.16 am IST

Electric Shock | గుట్కా న‌మిలి.. క‌రెంట్ తీగ‌పై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
Advertisement

Electric Shock | త్రినేత్ర న్యూస్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) విదిశా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుట్కా న‌మిలిన (Spitting Gutka) ఓ వ్య‌క్తి ఇంటి బాల్క‌నీ నుంచి దానిని ఉమ్మేశాడు. దీంతో అది నేరుగా విద్యుత్ తీగ‌ల‌కు త‌గ‌ల‌డంతో (Electric Shock) ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 23న జ‌రిగిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ప్ర‌భులాల్ గుప్తా అనే 65 ఏండ్ల వ్య‌క్తి మేస్త్రిగా (Mason) ప‌నిచేస్తున్నారు. గ‌త ప‌దేండ్లుగా విదిశాలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. గ‌త శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 23న‌) ఆయ‌న మూడో అంత‌స్తులోని బాల్క‌నీలో (Balcony) నిల‌బ‌డి గుట్కా న‌ములుతూ బ‌య‌ట‌కు ఉమ్మేశారు. దీంతో బాల్క‌నీకి అతి స‌మీపంగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగ‌పై (Electrical Wire) ఉమ్మి ప‌డింది. ఈ నేప‌థ్యంలో క‌రెంట్ షాక్‌కు గురైన అత‌డు తీవ్రంగా గాయ‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. కాగా, భవనాలకు అతి సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీర్లు ఉన్నాయని, దీనిపై గతంలో పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.

 

Advertisement
Advertisement