Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?
Palak Tiwari | బాలీవుడ్ యువ నటి పాలక్ తివారీ, నటుడు ఇబ్రహీం అలీఖాన్ ప్రేమాయణానికి తెరపడిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పరస్పర అంగీకారంతోనే తమ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Entertainment | Published On Oct 31, 2026, 9.14 am IST
Palak Tiwari | బాలీవుడ్ యువ నటి పాలక్ తివారీ, నటుడు ఇబ్రహీం అలీఖాన్ ప్రేమాయణానికి తెరపడిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పరస్పర అంగీకారంతోనే తమ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రేకప్‌కు అసలు కారణం ఏమిటన్నది మాత్రం తెలియరాలేదు.
ఇబ్రహీం నిర్ణయంతోనే బ్రేకప్?
మీడియా కథనాల ప్రకారం.. పాలక్, ఇబ్రహీం విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నారట. ఈ బంధానికి ముగింపు పలకాలని తొలుత ఇబ్రహీమే నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వీరిద్దరూ కలిసి చేయాల్సిన కొన్ని షూటింగ్‌లు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడినట్లు సమాచారం. ఈ బ్రేకప్‌పై ఇప్పటివరకు పాలక్ కానీ, ఇబ్రహీం కానీ అధికారికంగా స్పందించలేదు. విడిపోవడానికి గల అసలు కారణం తెలియదని, అయితే ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ వర్గం వెల్లడించినట్లు సదరు కథనం పేర్కొంది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని బహిరంగ చర్చకు తీసుకురావడం వారిద్దరికీ ఇష్టం లేదట. ప్రస్తుతం పాలక్, ఇబ్రహీం తమ తమ కెరీర్‌లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు సమాచారం.
2022లో మొదలైన డేటింగ్ వార్తలు
పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ 2022లోనే వార్తలు మొదలయ్యాయి. ముంబయిలోని ఓ రెస్టారెంట్ బయట వీరిద్దరూ తొలిసారి కలిసి కనిపించారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్ల కంటపడకుండా పాలక్ తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ జంట కలిసి కనిపించడంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు.. ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్లినట్లు కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్న బంధంపై పాలక్, ఇబ్రహీం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా.. తరచూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగింది.
కెరీర్‌పైనే దృష్టి
ఇన్నాళ్లూ తమ బంధంపై మౌనం పాటించిన పాలక్, ఇబ్రహీం.. ఇప్పుడు విడిపోయారనే వార్తలతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, ఈ బ్రేకప్ వార్తలపై వారిద్దరిలో ఎవరైనా అధికారికంగా స్పందిస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు వీరి విడిపోవడంపై వస్తున్న వార్తలను ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఇద్దరూ తమ కెరీర్‌లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాలక్ తివారీ 2000 అక్టోబర్ 8న జన్మించింది. ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ, నటుడు రాజా చౌదరీల కూతురు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పాలక్.. సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ది భూత్నీ’, ‘రోమియో ఎస్3’ సినిమాలతో పాటు ‘లుక్కే’ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Census 2027 | జనాభా లెక్కలకు ముహూర్తం ఖరారు.. 2027 జనవరి 25 నుంచి షురూ..
అక్టోబర్ 30, 2026

Rishab Shetty | రెండు పార్ట్‌లుగా ఛత్రపతి శివాజీ బయోపిక్ – టైటిల్ పాత్రలో కాంతార హీరో
అక్టోబర్ 30, 2026

Sanjay Raut | మాల్యా మోసగాడు కాదు.. మోదీ ప్రసంగాలు బాగుంటాయి.. సంజయ్ రౌత్ పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు
- ●Massive Fire | షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం
- ●Coldest October Day | అక్టోబర్‌లో అత్యంత చల్లని రోజుగా శుక్రవారం.. 75 ఏండ్లలో తొలిసారి..
- ●ISRO | జీపీఎస్ వ్యవస్థ బలోపేతం.. జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం
- ●Horoscope | అక్టోబర్ 31 రాశిఫలాలు.. పనులలో ఆలస్యం జరిగినా.. వాటిని పూర్తి చేస్తారు!
- ●Census 2027 | జనాభా లెక్కలకు ముహూర్తం ఖరారు.. 2027 జనవరి 25 నుంచి షురూ..

AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు

Massive Fire | షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం

Coldest October Day | అక్టోబర్‌లో అత్యంత చల్లని రోజుగా శుక్రవారం.. 75 ఏండ్లలో తొలిసారి..

ISRO | జీపీఎస్ వ్యవస్థ బలోపేతం.. జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం



