త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shehbaz Sharif | భార‌త్‌పై పాక్ గెలుపు.. ప్ర‌ధాని ష‌రీఫ్‌పై నెట్టింట ట్రోల్స్‌

Shehbaz Sharif | హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్‌లో భార‌త్‌పై పాక్ జ‌ట్టు నాలుగు వికెట్ల తేడాతో సాధార‌ణ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల పాక్ ప్ర‌ధాని (Pakistan PM) షెహ‌బాజ్ ష‌రీఫ్ (Shehbaz Sharif) గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పాక్ ఆట‌గాళ్ల‌ను అభినందిస్తూ పోస్టు చేశారు. అయితే, ఈ పోస్టుపై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. "గల్లీ క్రికెట్ లాంటి మ్యాచ్‌లో గెలిచి పెద్ద వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీల్ అవుతున్నారు.. దీనికి విక్టరీ పరేడ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి..?" అంటూ ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.

D

International | Published On Oct 31, 2026, 10.13 am IST

Shehbaz Sharif | భార‌త్‌పై పాక్ గెలుపు.. ప్ర‌ధాని ష‌రీఫ్‌పై నెట్టింట ట్రోల్స్‌
Advertisement
  • వారం రోజులు సెల‌వు ఇవ్వాల్సిందేనంటూ చుర‌క‌లు

Shehbaz Sharif | త్రినేత్ర న్యూస్ : హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్‌లో (Hong Kong Sixes 2026 match) భార‌త్‌పై పాక్ జ‌ట్టు (India-Pakistan) నాలుగు వికెట్ల తేడాతో సాధార‌ణ విజ‌యం సాధించింది. అయితే, ఈ విజ‌యంపై పాక్ ప్ర‌ధాని (Pakistan PM) షెహ‌బాజ్ ష‌రీఫ్ (Shehbaz Sharif) చేసిన ఓ ట్వీట్ నెట్టింట చర్చ‌కు దారి తీస్తోంది. నెటిజ‌న్లు ఆయ‌న్ని ట్రోల్ చేస్తూ తెగ పోస్టులు పెడుతున్నారు.

శుక్ర‌వారం జరిగిన హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శశాంక్ సింగ్ కేవలం 11 బంతుల్లోనే మెరుపు వేగంతో 40 పరుగులు చేసినప్పటికీ, నిర్ణీత 6 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 89 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఖ్వాజా నఫే (12 బంతుల్లో 41 పరుగులు), కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది (కేవలం 8 బంతుల్లో 35 పరుగులు) చెలరేగడంతో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించ‌గ‌లిగింది.

అయితే హాంకాంగ్ సిక్సెస్ అనేది గ్లోబల్ టోర్నమెంట్ లేదా ఆసియా కప్ లాంటి కాంటినెంటల్ ఈవెంట్ కాదు. ఇదొక సాధార‌ణ మ్యాచ్. క్రికెట్ భాష‌లో చెప్పాలంటే దీన్ని ఆట‌గాళ్లు గ‌ల్లీ క్రికెట్‌తో పోలుస్తారు. అలాంటి ఓ చిన్న టోర్నమెంట్‌లో పాక్ విజ‌యం సాధించ‌డంపై ఏకంగా ఆ దేశ ప్ర‌ధాని త‌మ జ‌ట్టుపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ పోస్టు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. "హాంకాంగ్ సిక్సెస్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన మా కుర్రాళ్ల‌కు అభినంద‌న‌లు. అదొక మంచి మ్యాచ్‌. ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో అంకిత‌భావంతో కృషి చేసిన పీసీబీ చైర్మ‌న్ మొహ్విన్ న‌క్వీ, ఆయ‌న బృందాన్ని నేను అభినందిస్తున్నాను" అని పాక్ ప్ర‌ధాని పోస్ట్ చేశారు. ఈ పోస్టు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది.

దీనిపై నెటిజ‌న్లు పాక్ ప్ర‌ధానిని ట్రోల్ చేస్తూ వ‌రుస కామెంట్లు చేస్తున్నారు. "ఏంటి ప్రధాని గారూ.. గెలిచింది వరల్డ్ కప్ అనుకుంటున్నారా..?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే ప్రపంచకప్‌లలో భారత్‌పై పాక్ జ‌ట్టు వరుసగా ఓడిపోతున్న విషయాన్ని కొంద‌రు గుర్తు చేస్తూ.. "ఇలాంటి గల్లీ క్రికెట్ లాంటి మ్యాచ్‌లలో గెలిచి పెద్ద వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీల్ అవుతున్నారు.. దీనికి విక్టరీ పరేడ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి..?" అంటూ ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. పాక్ ప్ర‌ధాని చాలా ఖాళీగా ఉన్న‌ట్లున్నారు..? పాక్ గెలిచినందుకు వారం రోజులు సెల‌వు (Declare Holiday) ఇవ్వాల్సిందే..! అంటూ చుర‌క‌లంటిస్తున్నారు.

Also Read..

వ‌చ్చే మూడు రోజులు వాన‌లు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

జీఎస్ఎల్‌వీ ప్ర‌యోగం విజ‌య‌వంతం.. ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌

మూడేళ్ల ప్రేమకు బ్రేకప్‌.. పాలక్‌ తివారీ, ఇబ్రహీం అలీఖాన్‌ విడిపోయారా?

ట్యాగ్స్:

Declare HolidayHong Kong Sixes 2026 MatchIndia PakistanPakistan PMShehbaz Sharif
Advertisement
Advertisement