త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hit and Run | బైక్‌ను ఢీకొట్టి ఆగ‌కుండా వెళ్లిన‌ లారీ.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Hit and Run | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో (Chevella) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల-శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై బైకును లారీ (Hit and Run) ఢీకొట్టింది. దీంతో భార్యాభ‌ర్త‌ల‌తోపాటు వారి ఆరేండ్ల కుమారుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

G

Telangana | Published On Oct 7, 2026, 9.05 am IST

Hit and Run | బైక్‌ను ఢీకొట్టి ఆగ‌కుండా వెళ్లిన‌ లారీ.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Advertisement

Hit and Run | త్రినేత్ర న్యూస్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో (Chevella) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల-శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై బైకును లారీ (Hit and Run) ఢీకొట్టింది. దీంతో భార్యాభ‌ర్త‌ల‌తోపాటు వారి ఆరేండ్ల కుమారుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. కూతురు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

మొయినాబాద్ (Moinabad) మండలం మేడిపల్లికి చెందిన కుమ్మరి మధు (36), భార్య సావిత్రి(30), కుమారుడు ధనుష్ (6), కుమార్తె అక్షితతో క‌లిసి మంగళవారం సాయంత్రం చేవెళ్ల మండలంలోని చన్‌వెల్లిలో ఫంక్షన్‌కు వెళ్లారు. రాత్రి కార్య‌క్ర‌మంలో ముగిసిన త‌ర్వాత బైక్‌పై మేడిప‌ల్లికి తిరుగుప‌య‌న‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో గొల్లపల్లి స్టేజి సమీపంలో వెనుక‌నుంచి దూసుకొచ్చిన లారీ.. వీరి బైకును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌ధు, సావిత్రి, ధ‌నుష్ ఘ‌ట‌నా స్థ‌లంలోనే ప్రాణాలు కోల్పాయారు. గాయ‌ప‌డిన అక్షిత‌ను స్థానికులు చేవెళ్ల ప్రభుత్వ ద‌వాఖాన‌కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్ర‌మాదానికి కార‌ణ‌మైన లారీని గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Advertisement
Advertisement