త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electric Shock | పొలంలో తెగిప‌డిన క‌రెంటు వైరు.. విద్యుత్ షాక్ రైతు మృతి

Electric Shock | రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దేవునిబండ తండాలో విషాదం చోటుచేసుకుంది. తెల్ల‌వారుజామున పొలం వ‌ద్ద‌కు వెళ్లిన రైతును విద్యుత్ వైర్లు (Electric Shock) బలిగొన్నాయి.

G

Telangana | Published On Oct 7, 2026, 12.07 pm IST

Electric Shock | పొలంలో తెగిప‌డిన క‌రెంటు వైరు.. విద్యుత్ షాక్ రైతు మృతి
Advertisement

Electric Shock | త్రినేత్ర న్యూస్‌: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దేవునిబండ తండాలో విషాదం చోటుచేసుకుంది. తెల్ల‌వారుజామున పొలం వ‌ద్ద‌కు వెళ్లిన రైతును విద్యుత్ వైర్లు (Electric Shock) బలిగొన్నాయి. దేవునిబండ తండాకు చెందిన మూడవత్ బాలు (42) బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు.

వరి చేనులోకి నడుచుకుంటూ వెళ్తుండగా పొలంలో అప్ప‌టికే తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు అతని కాళ్లకు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన బాలు అక్కడికక్కడే మృతిచెందారు. గుర్తించిన రైతులు అత‌ని కుటుంబ స‌భ్యుల‌తోపాటు పోలీసులకు స‌మాచారం అందించారు. ఉదయం పొలానికి వెళ్లిన రైతు విగతజీవిగా కనిపించడంతో స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement