త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | జీఎస్ఎల్‌వీ ప్ర‌యోగం విజ‌య‌వంతం.. ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌

PM Modi | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేప‌ట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తంచేశారు. ఎన్‌వీఎస్‌-03 ఉప‌గ్ర‌హాన్ని నిర్దేశించిన క‌క్షలో విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్టిన శాస్త్ర‌వేత్త‌లు, ఇంజినీర్ల‌ను అభినందించారు.

G

National | Published On Oct 31, 2026, 9.17 am IST

PM Modi | జీఎస్ఎల్‌వీ ప్ర‌యోగం విజ‌య‌వంతం.. ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేప‌ట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తంచేశారు. ఎన్‌వీఎస్‌-03 ఉప‌గ్ర‌హాన్ని నిర్దేశించిన క‌క్షలో విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్టిన శాస్త్ర‌వేత్త‌లు, ఇంజినీర్ల‌ను అభినందించారు. మ‌న‌ అంతరిక్ష రంగ శాస్త్రవేత్తల అంకిత‌భావం, ప్రతిభ దేశాన్ని ఎప్పటికప్పుడు గర్వపడేలా చేస్తున్నాయ‌న్నారు.

మన స్వదేశీ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ-నావిక్‌ (NavIC) ను మ‌రింత బలోపేతం చేసే దిశగా ఇది కీలక ముందడుగు అని చెప్పారు. ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం మెరుగైన సామర్థ్యాలను ఇది హైలైట్ చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నేవిగేషన్ సేవలకు ఈ ఉపగ్రహం మద్దతు అందిస్తుంది. కీల‌క సాంకేతిక రంగాల్లో ఆత్మ‌నిర్భ‌ర్ ల‌క్ష్యాన్ని సాధించే దిశ‌గా ఈ విజ‌యం మ‌రింత ముందుకు తీసుకెళ్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే నావిగేష‌న్ సేవ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో ఈ ఉప‌గ్ర‌హం కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు.

భారత్ సంకల్పానికి ప్రతిబింబం..

NVS-03 మిషన్ విజయం అంతరిక్ష సాంకేతిక రంగంలో భారత్ పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ (Jithendra Singh) అన్నారు. స్వదేశీ నావిగేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే భారత్ సంకల్పానికి ఈ విజయం ప్రతిబింబమని చెప్పారు. భారత అంతరిక్ష రంగంలో వస్తున్న విజయాలు విక్రమ్ సారాభాయ్, సతీష్ ధవన్ వంటి అంతరిక్ష రంగ దిగ్గజాలు కన్న కలలకు నిదర్శనమని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన సంస్కరణలు, అంతరిక్ష రంగానికి అందిస్తున్న ప్రోత్సాహం భారత్ సాధిస్తున్న విజయాలకు బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు.

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది (GSLV-F18 Rocket). 20 నిమిషాల తర్వాత ఎన్‌వీఎస్‌-03 నేవిగేషన్‌ ఉపగ్రహం నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి చేరింది. సొంత నేవిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగ ప్రధాన ఉద్దేశం.

ట్యాగ్స్:

GSLV F18ISROJithendra SinghNavICNVS 03Pm Modi
Advertisement
Advertisement