Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Rain Alert | ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురడంతో వాతావరణం చల్లబడింది.
Rain Alert | త్రినేత్ర న్యూస్: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌లో అయితే 2 గంటల పాటు వాన దంచికొట్టింది. కాగా, ఛత్తీస్‌గఢ్ నుంచి తూర్పు మధ్యప్రదేశ్ వరకు వ్యాపించిన అల్పపీడనం, దక్షిణ అండమాన్ సముద్రంలో కొత్తగా ఏర్పడిన మరో అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా కదిలే సూచనలున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆది, సోమ, మంగళవారాల్లో (నవంబర్ 3వ తేదీ వరకు) పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది.
శనివారం ముల్లగు, కొత్తగూడె, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక సోమవారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అదేవిధంగా 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
మంగళవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనికితోడు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీచేసింది.
1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :30-10-2026 https://t.co/reigDcF56Y
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 30, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణ : భట్టి విక్రమార్క
అక్టోబర్ 30, 2026

CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ
అక్టోబర్ 30, 2026

Kalvakuntla Kavitha | పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●PM Modi | జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ అభినందన
- ●Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?
- ●AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు
- ●Massive Fire | షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం
- ●Coldest October Day | అక్టోబర్‌లో అత్యంత చల్లని రోజుగా శుక్రవారం.. 75 ఏండ్లలో తొలిసారి..
- ●ISRO | జీపీఎస్ వ్యవస్థ బలోపేతం.. జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం

PM Modi | జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ అభినందన

Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?

AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు

Massive Fire | షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం



