త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AEES Teaching Recruitment | అటామిక్ ఎన‌ర్జీ ఎడ్యుకేష‌న్ సొసైటీలో టీచ‌ర్ ఉద్యోగాలు.. న‌వంబ‌ర్ 2 నుంచి ద‌ర‌ఖాస్తులు

AEES Teaching Recruitment | కేంద్ర అణుశ‌క్తి శాఖ‌కు చెందిన అటామిక్ ఎన‌ర్జీ ఎడ్యుకేష‌న్ సొసైటీ (AEES) దేశ‌వ్యాప్తంగా ఉన్న స్కూళ్ల‌లో టీచింగ్ స్టాఫ్ ఖాళీల భ‌క్తీని నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 254 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Oct 31, 2026, 8.20 am IST

AEES Teaching Recruitment | అటామిక్ ఎన‌ర్జీ ఎడ్యుకేష‌న్ సొసైటీలో టీచ‌ర్ ఉద్యోగాలు.. న‌వంబ‌ర్ 2 నుంచి ద‌ర‌ఖాస్తులు
Advertisement

AEES Teaching Recruitment | త్రినేత్ర న్యూస్‌: కేంద్ర అణుశ‌క్తి శాఖ‌కు చెందిన అటామిక్ ఎన‌ర్జీ ఎడ్యుకేష‌న్ సొసైటీ (AEES) దేశ‌వ్యాప్తంగా ఉన్న స్కూళ్ల‌లో టీచింగ్ స్టాఫ్ ఖాళీల భ‌క్తీని నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 254 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు (AEES Teaching Recruitment) ఆహ్వానిస్తున్న‌ది. ఇందులో ప్రిన్సిప‌ల్‌, వైస్ ప్రిన్సిప‌ల్‌, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియ‌న్‌, ప్రైమ‌రీ టీచ‌ర్ (PRT) వంటి పోస్టులు ఉన్నాయి. 12వ త‌ర‌గ‌తి, డిగ్రీ, పీజీ, బీఈడీ చేసిన‌వారు అర్హులు. న‌వంబ‌ర్ 2 నుంచి ద‌రాఖాస్తు చేసుకోచ్చు. న‌వంబ‌ర్ 22 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ aees.gov.in.ద్వారా ఆన్‌లైన్‌లో అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్‌ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఉద్యోగం సాధించిన‌వారికి ప్ర‌తి నెల రూ.35,400 నుంచి రూ.2,09,200 వ‌రకు ప్ర‌తినెల జీతం అందుకోవ‌చ్చు.

మొత్తం ఉద్యోగాలు: 254

ఇందులో జ‌న‌ర‌ల్ 112, ఓబీసీ ఎన్‌సీఎల్ 68, ఎస్సీ 33, ఎస్టీ 16, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు 25 చొప్పున కేటాయించారు.
ప్రిన్సిప‌ల్- 4
వైస్ ప్రిన్సిప‌ల్‌- 1
పీజీటీ- 27 (ఇంగ్లిష్ 4, మ్యాథ్స్ 4, బ‌యాల‌జీ 2, కెమిస్ట్రీ 3, ఫిజిక్స్ 2, కంప్యూట‌ర్ సైన్స్ 3, కామ‌ర్స్ 6, ఎక‌నామిక్స్ 2, హిస్ట‌రీ 1)
టీజీటీ- 102 (ఇంగ్లిష్ 14, సోష‌ల్ 11, హిందీ-సంస్కృతం 9, మ్యాథ్స్‌-ఫిజిక్స్ 22, కెమిస్ట్రీ-బ‌యోల‌జీ 13, కంప్యూట‌ర్ సైన్స్ 13, పీహెచ్ఈ 12, ఆర్ట్ 7, మ‌రాఠీ 1)
లైబ్రేరియ‌న్‌- 13
పీఆర్‌టీ- 89
ప్రైమ‌రీ టీచ‌ర్ మ్యూజిక్‌- 10
బాల‌వాటిక‌ టీచ‌ర్‌- 8

అర్హ‌త‌లు: ఇంట‌ర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, డిప్లొమా, సీటీఈటీ ఉత్తీర్ణులు. ప‌లు పోస్టుల‌కు అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థులు 30 నుంచి 50 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: కంప్యూట‌ర్ ఆధారిత రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ (ప్రిన్సిప‌ల్‌, వైస్ ప్రిన్సిప‌ల్ పోస్టుల‌కు), స్కిల్ టెస్ట్ (టీచింగ్‌, లైబ్రేరియ‌న్ పోస్టుల‌కు). రాత‌ప‌రీక్ష కేంద్రాలు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ఢిల్లీ, ముంబైతోపాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఉన్నాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.1000+జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌లు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు రూ.250
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 2
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 22
వెబ్‌సైట్: aees.onlineregistrationforms.com.

 

ట్యాగ్స్:

AEESAEES Teaching RecruitmentNotificationsPGTTGT
Advertisement
Advertisement