త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reactor Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్ట‌ర్‌.. ఇద్ద‌రు కార్మికులు మృతి

Reactor Blast | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మండ‌లంలోని దోతిగూడెంలో (Dothigudem) ఉన్న ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో (Pharma Company) భారీ పేలుడు సంభ‌వించింది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ప‌రిశ్ర‌మ‌లోని రియాక్ట‌ర్ (Reactor Blast) ఒక్క‌సారిగా పేలింది.

G

Telangana | Published On Aug 22, 2026, 6.15 am IST

Reactor Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్ట‌ర్‌.. ఇద్ద‌రు కార్మికులు మృతి
Advertisement

Reactor Blast | త్రినేత్ర‌.న్యూస్‌: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మండ‌లంలోని దోతిగూడెంలో (Dothigudem) ఉన్న ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో (Pharma Company) భారీ పేలుడు సంభ‌వించింది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ప‌రిశ్ర‌మ‌లోని రియాక్ట‌ర్ (Reactor Blast) ఒక్క‌సారిగా పేలింది. దీంతో ఇద్ద‌రు మ‌ర‌ణిచ‌గా, మ‌రో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

దొంతిగూడెంలోని హెజోలో రసాయన (Azolo Pharma) పరిశ్రమలో శుక్రవారం రాత్రి భారీ శ‌బ్దంతో రియాక్ట‌ర్ పేలిపోయింది (Reactor Explosion). దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పరిశ్రమ అంతటా వ్యాపించడంతో, ఆ మంటల్లో చిక్కుకొని కార్మికులు గాయ‌ప‌డ్డారు. ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యం ఫైర్ సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న వారు.. మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో పేలుడు జ‌రిగిన ప్రాంతంలో ప‌ది మందికిపైగా ఉన్నార‌ని ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే ఇత‌ర కార్మికులు తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌లించారు. మృతుల‌ను రాజ‌శేఖ‌ర్‌, నాగ‌రాజుగా గుర్తించారు.

రియాక్టర్‌లో (Reactor) సాల్వెంట్ నింపుతుండగా రసాయనిక చర్య జ‌ర‌గ‌డంతోపే ప్రమాదం జ‌రిగి ఉండ‌వ‌చ్చున‌ని పోలీసులు భావిస్తున్నారు. సాల్వెంట్ నింపే ప్రక్రియలో తీవ్ర ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయిందని, దీంతో మంటలు విపరీతంగా ఎగిసిపడ్డాయని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. మంటల తీవ్రతకు సహాయక చర్యల కోసం వచ్చిన అంబులెన్స్‌లు కూడా లోప‌లికి వెళ్లలేని పరిస్థితి ఏర్ప‌డింది. కాగా, ఈ ప్రమాదంలో 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్న‌ది. ఈ ప‌రిశ్ర‌మ‌లో గ‌త మూడు నెలల్లో ఇది రెండో ప్రమాద‌మ‌ని గ్రామస్థులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement