త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB | ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్

ACB | యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ ప్రైవేట్ పెట్రోల్ బంక్ టెక్నీషియన్ లంచం తీసుకుంటూ ఏసీబీ( ACB ) అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు.

S

Telangana | Published On Oct 28, 2026, 5.53 pm IST

ACB | ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్
Advertisement

ACB | త్రినేత్ర న్యూస్ : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ ప్రైవేట్ పెట్రోల్ బంక్ టెక్నీషియన్ లంచం తీసుకుంటూ ఏసీబీ( ACB ) అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. పెట్రోల్ బంక్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ, డైలీ సేల్స్ రిజిస్టర్ అప్పగించేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకు హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో టెక్నీషియన్ లంచం తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇందులో రూ.15 వేలు ఇన్‌స్పెక్టర్‌కు, రూ.5 వేలు టెక్నీషియన్‌కు చెందాల్సి ఉన్నట్లు వెల్లడించింది. ఇద్దరినీ న్యాయ రిమాండ్ కోసం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు.

లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సాప్ 9440446106కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపింది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
Advertisement