త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadadri | యాదాద్రిలో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌.. ఎందుకంటే.?

Yadadri | యాదాద్రి ఆల‌యం వ‌ద్ద విషాదం నెల‌కొంది. గుట్ట‌పై భిక్షాట‌న చేస్తూ జీవ‌నం సాగిస్తున్న ఓ యాచ‌కురాలిని కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆల‌యం మూసివేసి ద‌ర్శ‌నాలు నిలిపివేశారు అధికారులు.

S

Telangana | Published On Sep 22, 2026, 6.34 pm IST

Yadadri | యాదాద్రిలో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌.. ఎందుకంటే.?
Advertisement

Yadadri | త్రినేత్ర న్యూస్ : యాదాద్రి ఆల‌యం వ‌ద్ద విషాదం నెల‌కొంది. గుట్ట‌పై భిక్షాట‌న చేస్తూ జీవ‌నం సాగిస్తున్న ఓ యాచ‌కురాలిని కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆల‌యం మూసివేసి ద‌ర్శ‌నాలు నిలిపివేశారు అధికారులు.

యాద‌గిరిగుట్ట‌కు చెందిన ఈశ్వ‌రమ్మ గ‌త కొన్నేండ్ల నుంచి యాదాద్రి టెంపుల్ వ‌ద్ద భిక్షాట‌న చేస్తూ జీవిస్తోంది. అయితే మంగ‌ళ‌వారం ఉద‌యం వేగంగా వ‌చ్చిన ఓ కారు.. ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాల‌పాలైన ఆమె ప్రాణాలు కోల్పోయింది. స‌మాచారం అందుకున్న ఆల‌య అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యాచ‌కురాలి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం భువ‌న‌గిరి ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇక ఈశ్వ‌ర‌మ్మ మృతితో గుడిని మూసివేసి ద‌ర్శ‌నాలు నిలిపివేశారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం తిరిగి దర్శనాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. అయితే భిక్షాట‌న చేయ‌గా వ‌చ్చిన పైస‌ల్లో కొంత డ‌బ్బును ఆల‌య అభివృద్ధికి విరాళంగా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement