KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ భూములను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్నారంటే.. మతలబు ఉంది అని తెలిపారు. అన్నీ వెలుగులోకి వస్తాయి.. వేటిని వదిలిపెట్టబోం అని కేటీఆర్ హెచ్చరించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ భూములను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్నారంటే.. మతలబు ఉంది అని తెలిపారు. అన్నీ వెలుగులోకి వస్తాయి.. వేటిని వదిలిపెట్టబోం అని కేటీఆర్ హెచ్చరించారు. ఢిల్లీలో మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రజల సొమ్ము దోచుకోవడానికే 22ఏ పేరిట, లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి, 30 శాతం కమీషన్ కోసం చేసే చిల్లర ప్రయత్నాలను మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేల కాలనీలు, ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు రేవంత్ ప్రభుత్వం ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఇంటి మీదకు వేలమంది గూండాలను పంపించారు. మేము అక్కడికి వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు.అక్కడికి కూడా మా మీదకు గూండాలను ఉసిగొల్పారు. నిన్న నా సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, పోలీస్ స్టేషన్‌లో వారి మీద కాంగ్రెస్ గూండాలతో దాడికి దిగారు అంటే.. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత చెత్తగా ఉన్నాయో అర్ధం అవుతోంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి, వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే పేరుతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారనే అనుమానం కూడా ఉంది. రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకం వెనుక ఉన్న అక్రమాలు భవిష్యత్తులో బయటపడతాయి. రెండేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుంది. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం అని కేటీఆర్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్
- ●Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదు..?
- ●Sampoornesh Babu | కెరీర్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకే తీసుకున్నా - ప్యారడైజ్పై సంపూర్ణేష్ బాబు కామెంట్స్
- ●Sushila Rani’s Surrender | చరమాంకానికి మావోల పోరు.. లొంగిపోయిన మరో కీలక నాయకురాలు
- ●సౌదీ–ఇజ్రాయెల్ను దగ్గర చేస్తున్న ఇరాన్?.. మక్కా ఒప్పందం ఉన్నా కొత్త లెక్క!
- ●Telangana Police | షూటింగ్లో తెలంగాణ పోలీసుల జోరు.. విజేతలకు డీజీపీ అభినందన

Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్

Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదు..?

Sampoornesh Babu | కెరీర్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకే తీసుకున్నా - ప్యారడైజ్పై సంపూర్ణేష్ బాబు కామెంట్స్

Sushila Rani’s Surrender | చరమాంకానికి మావోల పోరు.. లొంగిపోయిన మరో కీలక నాయకురాలు




