Mahesh Babu | మహేష్ బాబు ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌కు 35 లక్షల ఫైన్ – రూమర్లపై క్లారిటీ ఇదిగో!
హీరో మహేష్‌బాబుకు చెందిన ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌కు జీఎస్‌టీ అధికారులు 35 లక్షల ఫైన్ విధించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై ఏఎమ్‌బీ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. పాత వార్తలను నమ్మవద్దని కోరింది.
Entertainment | Published On Jun 30, 2026, 7.54 pm IST
Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబుకు చెందిన ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌కు జీఎస్‌టీ ట్రిబ్యూనల్ అధికారులు భారీగా జరిమానా విధించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏఎమ్‌బీతో పాటు హైదరాబాద్‌లోని మరో ఐదు సింగిల్ స్క్రీన్లకు కూడా ఫైన్ విధించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ రూమర్లపై ఏఎమ్‌బీ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.
జీఎస్‌టీ తగ్గించినా...
2019 జనవరి 1 నుంచి సినిమా టికెట్లపై జీఎస్‌టీని ప్రభుత్వం తగ్గించింది. జీఎస్‌టీలో సవరణలు చేసినా ఏఎమ్‌బీతో పాటు మరో ఐదు సింగిల్ స్క్రీన్లు టికెట్ ధరలను మాత్రం మార్చలేదని జీఎస్‌టీ ట్రిబ్యూనల్ అధికారులు ఆరోపించారు. బేస్ టికెట్ ధరలను పెంచి పాత రేట్లకే టికెట్లను అమ్ముతూ జీఎస్‌టీ చట్టంలోని యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధలను ఉల్లంఘించినట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్‌బాబు ఏఎమ్‌బీ థియేటర్‌పై జీఎస్‌టీ ట్రిబ్యూనల్ అధికారులు 35 లక్షలు ఫైన్ విధించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఏఎమ్‌బీతో పాటు భ్రమరాంభ, జ్యోతి, కుమార్, ఏఎస్ఆర్, విశ్వనాథ్ థియేటర్లకు కలిపి కోటి ఏడు లక్షల వరకు జరిమానా విధించారని, ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధులకు జమ చేయాలని జీఎస్‌టీ ట్రిబ్యూనల్ అధికారులు ఆదేశించినట్లు సమాచారం.
పాత వార్తలు...
ఈ జరిమానా వార్తలపై ఏఎమ్‌బీ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. "హీరో మహేష్ బాబుకు చెందిన ఏఎమ్‌బీ సినిమాస్ పై జరిమానా అంటూ మీడియాలో వస్తున్న వార్త ఇప్పటిది కాదు.. ఈ విషయానికి సంబంధించిన అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యాయి.. పాత వార్తను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పుకార్లను నమ్మవద్దు" అంటూ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Akhil Raj | జరిగింది తెలియకుండా నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు – డెలివరీ బాయ్‌తో గొడవపై రాజు వెండ్స్ రాంబాయి హీరో క్లారిటీ
జూన్ 30, 2026

DGP Anand | స్పెషల్ బెటాలియన్ల సేవలు దగ్గరుండి చూశా.. రాష్ట్ర భద్రతకు వారు ఎంతో అవసరం: డీజీపీ సి.వి.ఆనంద్
జూన్ 30, 2026

Raja Singh | రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు..!
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లు అందించాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | నీ అయ్య జాగీరా దిగిపోవడానికి : సీఎం రేవంత్ రెడ్డి
- ●E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ప్రయోగాత్మక అధ్యయనం.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం..!
- ●Collector Manu Choudary | నాతో ఐదారు మంది సీసీలు పని చేశారు.. అందులో భాస్కర్ చాలా బెస్ట్: కలెక్టర్ ప్రశంస
- ●Rahul Ravindran | ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ.. రష్మికను పుణే సియా గోయల్‌తో పోల్చిన నెటిజన్లు.. ఎక్స్ యాప్ డిలీట్ చేసిన డైరెక్టర్
- ●TG Cabinet | జులై 2న తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం

CM Revanth Reddy | రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లు అందించాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | నీ అయ్య జాగీరా దిగిపోవడానికి : సీఎం రేవంత్ రెడ్డి

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ప్రయోగాత్మక అధ్యయనం.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం..!

Collector Manu Choudary | నాతో ఐదారు మంది సీసీలు పని చేశారు.. అందులో భాస్కర్ చాలా బెస్ట్: కలెక్టర్ ప్రశంస



