త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేష‌న్ చేసుకోండిలా..!

TSLPRB | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీఎస్ఎల్పీఆర్బీ పోస్టుల భ‌ర్తీకి అవ‌స‌ర‌మైన ప్ర‌క్రియ చేప‌ట్టింది.

S

Telangana | Published On Sep 19, 2026, 7.52 am IST

TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేష‌న్ చేసుకోండిలా..!
Advertisement

TSLPRB | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీఎస్ఎల్పీఆర్బీ పోస్టుల భ‌ర్తీకి అవ‌స‌ర‌మైన ప్ర‌క్రియ చేప‌ట్టింది. తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేసింది.

నోటిఫికేష‌న్ వెలువ‌డిన నాటి నుంచే ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌కు పోటీ ప‌డుతున్న అభ్య‌ర్థులు క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. తెల్ల‌వారుజాము నుంచే గ్రౌండ్స్‌లో వాలిపోతున్నారు. ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ సాధిస్తున్నారు. ఇలాంటి అభ్య‌ర్థుల‌కు వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌రేట్ శుభ‌వార్త వినిపించింది.

వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత పోలీస్ పరీక్షల కోచింగ్ అందించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప్ర‌క‌టించింది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

స్క్రీనింగ్ టెస్టు ఎప్పుడంటే..?

అక్టోబ‌ర్ 20(ఉ. 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు)

స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే కేంద్రాలు

1. వరంగల్: CKM కాలేజీ, దేశాయిపేట
2. హనుమకొండ: SVS కాలేజీ, రామారం
3. జనగామ: CJIT ఇంజినీరింగ్ కాలేజీ, యశ్వంతపూర్ క్రాస్ రోడ్
4. పరకాల: ప్రభుత్వ జూనియర్ కాలేజీ
5. నర్సంపేట: BITS కాలేజీ, లక్నేపల్లి

స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు కింది గూగుల్ ఫామ్ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు:

https://forms.gle/MnWvoZGhA9mFCXCC6

(తేదీ: 19-09-2026 శనివారం రాత్రి 8 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి)

 

Advertisement
Advertisement