Jeevan Reddy | నా మెడ నరకాలని చూస్తున్నారు.. రెండు భుజాలుగా ఉన్నవారినీ దూరం చేశారు..
(Jeevan Reddy) | ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన మెడ నరకడానికి కాంగ్రెస్ (Congress) లో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
- ఎన్నికల ప్రచారంలో జీవన్‌రెడ్డి భావోద్వేగం
త్రినేత్ర.న్యూస్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన మెడ నరకడానికి కాంగ్రెస్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన రెండు భుజాలుగా ఉన్న వ్యక్తులను తనకు దూరం చేశారని ఆవేదన చెందారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టమని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సంజయ్ కుమార్ (Sanjay Kumar) తాను బీఆర్‌ఎస్ (BRS) పార్టీలోనే ఉన్నానని చెబుతూ కాంగ్రెస్ (CONGRESS) జెండాతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రచారం సందర్భంగా పార్టీకి చెందిన మహిళలు, కార్యకర్తల ఎదుట శుక్రవారం ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. వారు జీవన్‌రెడ్డిని ఓదార్చారు.
రాహుల్ గాంధీ మాటను మరిచిండు..
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పై ఫైరయ్యారు. పార్టీ మారొద్దని చెప్పి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రచారం సందర్భంగా పార్టీకి చెందిన మహిళలు, కార్యకర్తలతో ఆయన తన బాధను పంచుకున్నారు. ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ వర్గాన్నే ఈ ఎన్నకల్లో గెలిపిస్తామని.. మీరు బాధపడొద్దని అక్కడున్నవారు జీవన్‌రెడ్డిని ఓదార్చారు. కాగా చట్టసభలకు ఏ పార్టీ తరఫున గెలిస్తే ఆ పార్టీలోనే ఉండాలని గతంలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పిన విషయాన్ని కూడా జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.
ఓటుతో కొట్టాలి...
వేరే పార్టీల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్లను ఓటుతో కొట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడే వారికి బుద్ధి వచ్చే అవకాశం ఉందని అన్నారు. తన వర్గం వారికి కాంగ్రెస్ సీట్లు నిరాకరించడంతో కొన్ని వార్డుల్లో స్వతంత్రులుగా బరిలో దిగారు. వారి తరఫున ఆయన ప్రచారం చేశారు.
కాంగ్రెస్ జెండాతో ప్రచారమా?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన వర్గాన్ని పక్కనపెట్టి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ జెండా పట్టుకుని ఎలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు. మాయమాటలు చెబుతూ సంజయ్ కాంగ్రెస్ జెండాను ఎత్తుకుపోయాడన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



