Kavitha | కార్మికుల సమస్యల పరిష్కారంలో INTUC, ఏఐటీయూసీ పూర్తిగా విఫలం: కవిత
Kavitha | కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఐఎన్టీయూసీ (INTUC), ఏఐటీయూసీ (AITUC) పూర్తిగా విఫలమయ్యాయని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమసలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఐఎన్టీయూసీ (INTUC), ఏఐటీయూసీ (AITUC) పూర్తిగా విఫలమయ్యాయని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమసలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి బాయిబాట (Singareni Baibata) కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని ఓసిపి-3 ప్రాజెక్టును కవిత సందర్శించారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్మికులను స్వయంగా కలిసిన ఆమె, వారి కష్టసుఖాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రామగుండం OCP-3 వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. కోల్ బెల్ట్ ప్రాంత కార్మికులు ఆశీర్వదించిన వారే అధికారంలోకి వస్తారన్నారు.
హెచ్ఎంఎస్ (HMS) సంఘంతో కలిసి సింగరేణి కార్మికుల సొంతింటి కలను కచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు. గతంలో కార్మికులు కోల్పోయిన హక్కులను తిరిగి తీసుకువస్తామని వెల్లడించారు. సింగరేణిలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియను పునరుద్ధరిస్తామన్నారు. మిగతా సంఘాలు సమస్యలపై కేవలం ప్రశ్నించి వదిలేస్తాయని, పరిష్కారం చూపవని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా రామగుండం OCP-3 వద్ద కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి సింగరేణి కార్మికులు, డంపర్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు#TrsBaayiBata #KavithakkaBaayiBata pic.twitter.com/ccQLEiwLqr
— Telangana Rakshana Sena (@TRSparty_HQ) June 18, 2026
సంబంధిత వార్తలు

Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
ఆగస్టు 15, 2026

POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు
ఆగస్టు 9, 2026

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
- ●నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!
- ●State Museum | వైఎస్సార్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం
- ●Ritika Nayak | కథ నచ్చితేనే ఓకే.. రితికా నాయక్ ప్లాన్ ఇదే
- ●WhatsApp Cyber Fraud | వాట్సప్‌లో 'బాస్' మెసేజ్.. ఏకంగా రూ.1 కోటి కొల్లగొట్టిన కేటుగాడు, పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు

నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!

State Museum | వైఎస్సార్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం



