త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni Strike | స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతున్న‌ సింగ‌రేణి.. ఎప్ప‌టి నుంచంటే?

Singareni Strike | సింగ‌రేణి కార్మికులు స‌మ్మెకు (Singareni Strike) సిద్ధ‌మ‌వుతున్నారు. కార్మికుల‌కు సంబంధించిన ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) ప్రతినిధులు సంస్థ యాజ‌మాన్యానికి నోటీసులు ఇచ్చారు.

G

Telangana | Published On Jun 9, 2026, 9.54 am IST

Singareni Strike | స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతున్న‌ సింగ‌రేణి.. ఎప్ప‌టి నుంచంటే?
Advertisement

Singareni Strike | త్రినేత్ర‌.న్యూస్‌: సింగ‌రేణి కార్మికులు స‌మ్మెకు (Singareni Strike) సిద్ధ‌మ‌వుతున్నారు. కార్మికుల‌కు సంబంధించిన ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) ప్రతినిధులు సంస్థ యాజ‌మాన్యానికి నోటీసులు ఇచ్చారు. సింగరేణిలో (Singareni) నూతన గనులను ఏర్పాటు చేయాలని, కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, జెన్‌కో సంస్థ సింగరేణికి బకాయి ఉన్న రూ.56వేల కోట్లను వెంటనే విడుదల వంటి 30 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును జనరల్ మేనేజర్ (పర్సనల్) కవితా నాయుడుకు అందజేశారు. స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించకపోతే జూలైలో స‌మ్మెకు దిగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. .

ప్రధాన డిమాండ్లు ఇవే

నూతన గనులు: గత 12 ఏళ్లుగా కొత్త గనులు రాకపోవడం వల్ల పాత యంత్రాలతోనే (డంపర్లు, డోజర్లు) నడుపుతున్నారు, కాబట్టి తక్షణమే కొత్త భూగర్భ (UG), ఓపెన్ కాస్ట్ (OC) గనులను ఏర్పాటు చేయాలి.

సొంతింటి కల: సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులందరికీ సొంత ఇళ్ల నిర్మాణ నిధులు లేదా స్థలాలు కేటాయించాలి.

మెడికల్ బోర్డుల పునరుద్ధరణ: గనుల్లో అనారోగ్యానికి గురైన కార్మికుల కోసం నిలిచిపోయిన మెడికల్ బోర్డు ప్రక్రియను వెంటనే పునఃప్రారంభించాలి.

జెన్‌కో బకాయిలు: తెలంగాణ జెన్‌కో (TG GENCO) నుంచి సింగరేణికి రావాల్సిన రూ.56 వేల‌ కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేత ఇప్పించాలి.

ఉపాధి, హక్కులు: కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సింగరేణి ఉద్యోగుల వారసుల ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని సవరించాలి.

ప్రైవేటీకరణ నిరోధం: కేంద్ర ప్రభుత్వ బొగ్గు బ్లాకుల వేలం, ప్రైవేట్ ఓబీ (OB) కంపెనీల జోక్యం, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను పూర్తిగా వ్యతిరేకించాలి.

Advertisement
Advertisement